గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

మండిపోతున్న రెమిడెసివిర్‌ ధర!

విచ్చలవిడిగా నల్లబజారుకు

దిల్లీ: కొవిడ్‌-19కు అత్యవసర చికిత్స సాధనంగా ఇటీవలే అనుమతి పొందిన రెమిడెసివిర్‌ ఔషధం దురాశపరులైన ఔషధ దుకాణ యజమానులకు, డీలర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రాణాపాయంలో ఉన్న కరోనా బాధితుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఈ మందు రేటును అనేక రెట్లు పెంచి, జనాన్ని దారుణంగా దోచుకుంటున్నారు. ముఖ్యంగా దిల్లీలో ఔషధ దుకాణాల నుంచి విచ్చలవిడిగా నల్లబజారుకు తరలిపోతోంది. రోజురోజుకూ దీని ధర పెరిగిపోతోంది. దిల్లీలో ఇంతకుముందు బ్లాక్‌ మార్కెట్‌లో ఆ ఔషధం ధర రూ.15వేలుగా ఉండగా .. ఇప్పుడది దాదాపు రూ. 35 వేలకు ఎగబాకిందని కొవిడ్‌ బాధితుడి బంధువొకరు ‘ఈటీవీ భారత్‌’తో చెప్పారు. దక్షిణ, తూర్పు దిల్లీ, గురుగ్రామ్‌లో బ్లాక్‌మార్కెట్‌లో రెమిడెసివిర్‌ లభ్యమవుతోందని, అధీకృత డీలర్ల వద్ద మాత్రం లేదని తెలిపారు. ఇలాంటి కీలకమైన ఔషధాల ధరను కట్టడి చేయడానికి దేశంలో సమర్థ యంత్రాంగం లేదని విమర్శించారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని