☰
బుధవారం, ఏప్రిల్ 14, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 25/02/2021 07:00 IST
అమెజాన్‌ ప్రైమ్‌ రూ.20 మాత్రమే!

ఓటీపీలు ఇచ్చేస్తున్న సైబర్‌ నేరస్థులు.. టెలిగ్రామ్‌లో ప్రకటనలు

ఈనాడు, హైదరాబాద్‌: ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మొబైల్‌యాప్‌ సభ్వత్యం నెలకు రూ.129. అయితే రూ.20 ఇస్తే ఓటీపీ చెబుతాం.. తీసుకోండి.. ఆనందించండి. నెట్‌ఫ్లిక్స్‌ రెండు నెలల చందా రూ.25కే ఇస్తాం..’ అంటూ సైబర్‌ నేరస్థులు ప్రచారం చేసుకుంటున్నారు.. టెలిగ్రామ్‌ మెసెంజర్‌లో వీరిస్తున్న ప్రకటనలు చూసి వందలసంఖ్యలో యువకులు, విద్యార్థులు టెలిగ్రాం మెసెంజర్‌ బృందంలో సభ్యులై రూ.20, రూ.25 నగదు బదిలీ చేసుకుని ఓటీపీలు తీసుకుంటున్నారు. ఇంతేకాదు డిస్నీ, హాట్‌స్టార్‌, యూట్యూబ్‌ ప్రీమియం, సోనీలైవ్‌, జీఫైవ్‌ ఇలా వినోద ఛానెళ్లకు సంబంధించిన నెల, ఏడాది చందాలకు తక్కువ ధరలకే ఇస్తున్నారు. ఒక యువతిని వేధించిన కేసులో నిందితుడిని విచారిస్తున్న క్రమంలో సైబర్‌క్రైమ్‌ పోలీసులు అతడి ఫోన్‌ను బుధవారం పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

‘ఓటీపీ బయ్యర్స్‌.. సెల్లర్స్‌’

టెలిగ్రామ్‌ మెసెంజర్‌లో ‘ఓటీపీ బయ్యర్స్‌, సెల్లర్స్‌’ పేరుతో ఒక బృందాన్ని సైబర్‌ నేరస్థులు నిర్వహిస్తున్నారు. టెలిగ్రామ్‌ మొబైల్‌ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నవారు ఓటీపీ బయ్యర్స్‌, సెల్లర్స్‌ బృందంలో సభ్యులుగా చేరేందుకు వీలుంది. ‘జాయిన్‌’ అని క్లిక్‌ చేయగానే స్వాగతం అంటూ సందేశం వస్తుంది. సభ్యులుగా చేరినవారు వినోద ఛానళ్లు వీక్షిస్తామంటే ఫలానా ఛానల్‌ పేరును పంపి రూ.20 బదిలీ చేస్తే క్షణాల్లో ఓటీపీ వస్తుంది. అమెజాన్‌ ప్రైమ్‌ మొబైల్‌యాప్‌లోకి ప్రవేశించి ఓటీపీ నమోదు చేయగానే ఎంచక్కా అందులోని సినిమాలను చూడొచ్ఛు ఎంత మంది రూ.20 పంపితే అంతమందికీ ఓటీపీలు పంపుతున్నారు. ఇదంతా ఎవరు, ఎలా చేస్తున్నారో తెలుసుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. పూర్తి సమాచారం ఇవ్వాలంటూ టెలిగ్రాం సంస్థను అభ్యర్థించారు.

వర్చువల్‌ సిమ్‌కార్డులూ

వినోద ఛానళ్ల వీక్షణాన్ని తక్కువ ధరలకే అందిస్తున్న సైబర్‌ నేరస్థులు వర్చువల్‌ అవసరమైనవారికి వర్చువల్‌ సిమ్‌కార్డులనూ(అసలు సిమ్‌కార్డు నిందితుల వద్ద ఉంటుంది.) సమకూర్చుతున్నారని పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్‌లో ఉంటున్న ఓ యువకుడు.. ఒక యువతిని వేధించేందుకు నిందితుల నుంచి వర్చువల్‌ సిమ్‌కార్డు తీసుకున్నాడు. నెలరోజుల నుంచి వేధిస్తున్నాడు. ఆమె ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా తొలుత పోలీసులకు ఎవరన్నది తెలియలేదు. సాంకేతిక పరిజ్ఞానంతో యువకుడిని గుర్తించారు. విచారించగా ఓటీపీ బయ్యర్స్‌, సెల్లర్స్‌తోపాటు వర్చువల్‌ సిమ్‌కార్డుల విషయం బయటకు వచ్చింది. వర్చువల్‌ నంబర్లను వినియోగిస్తున్న వారు ఎవరికీ తెలియకుండా ప్రైవేటు సంభాషణల కోసం, గిట్టనివారిని వేధించేందుకు, బెదిరించేందుకు వాడతున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వర్చువల్‌ నంబర్లను వాడుతున్న వారిని గుర్తించడం కష్టమే. ఎందుకంటే ఆ ఫోన్‌ నంబర్‌ అమెరికా, దుబాయ్‌, షాంఘై అంటూ వేర్వేరు ప్రాంతాలను చూపిస్తోంది.

Tags:

మరిన్ని

  • TS: బీర్కూర్‌లో ఒక్కరోజే 60 కొవిడ్‌ కేసులు[21:47]
  • షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు[21:14]
  • టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM[21:00]
  • అప్రమత్తంగా లేకపోతే మనదీ ‘మహా’ పరిస్థితే![20:10]
  • భోజన ప్రియుల కోసం.. ఓ విమానం![18:11]
  • వైకాపా ఎమ్మెల్యేకు కరోనా..ఐసీయూలో చికిత్స[17:59]
  • ఈ సమయంలో ధర్నాలు చేయొద్దు: ఈటల[17:33]
  • టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM[17:00]
  • ఏపీలో 4,157 కేసులు.. 18 మరణాలు[16:49]
  • కౌలు రైతుగా మాజీ జేడీ లక్ష్మీనారాయణ[13:59]
  • టాప్‌ 10 న్యూస్‌ @ 1PM[12:57]
  • అంబేడ్కర్‌ ఆశయాలు కొనగిస్తున్నాం:కేటీఆర్‌[12:10]
  • తెలంగాణలో కొత్తగా 2,157 కరోనా కేసులు[09:21]
  • టాప్‌ 10 న్యూస్‌ @ 9AM[08:57]
  • హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం[06:08]
  • తెదేపా సభలో రాళ్ల దాడిపై ఆధారాల్లేవ్‌: డీఐజీ[01:15]
  • అన్ని మతాలకు సమాన గౌరవం: కేసీఆర్[01:09]
  • కొవిడ్‌ ఎఫెక్ట్‌: విశాఖ రైల్వేస్టేషన్‌లో మార్పులు[01:05]
  • మీ వాట్సాప్‌ ఖాతాను ఇలా కూడా హ్యాక్‌ చేస్తారు![01:01]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • బుల్లితెర జలపాతంలో సుధీర్‌, రష్మి
  • మూఢ విశ్వాసంతో కన్నబిడ్డలనే కడతేర్చే యత్నం
  • ‘ప్రియుడి ఒత్తిడితోనే కుమార్తె ఆత్మహత్య’
  • ఇజ్రాయెల్..‌ అందుకో టీకా ఫలం‌!
  • మార్కెట్లలో జోష్‌ నింపిన కేంద్రం నిర్ణయం
  • పదేళ్లకే నాకు పెళ్లి చేశారు: నటి కృష్ణవేణి
  • సెకండ్‌ వేవ్‌.. చిత్రసీమపై కరోనా ప్రతాపం
  • గుట్టలుగా మృతదేహాలు.. ఖాళీలేని శ్మశానాలు!
  • ఐపీఎల్‌ నుంచి స్టోక్స్‌ ఔట్‌
  • రోహిత్‌ నమ్మాడు.. రాహులే వికెట్లు తీశాడు
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.