☰
బుధవారం, ఏప్రిల్ 14, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 25/02/2021 07:25 IST
బస్సు చక్రాల కింద నలిగి గర్భిణి దుర్మరణం

భర్తకు తీవ్రగాయాలు

ప్రమాదం జరిగిన ప్రాంతం

నారాయణగూడ, న్యూస్‌టుడే: మరోమారు తల్లిదండ్రులం కాబోతున్నామన్న వారి ఆనందం క్షణాల్లో ఆవిరైపోయింది. కడుపులో బిడ్డా దూరమయ్యాడు. దాదాపు 8 గంటలపాటు మృత్యువుతో పోరాడిన ఆ తల్లి కళ్లు మూసింది. ఆమె భర్త తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ హృదయ విదారక సంఘటన చూసిన అందరి కళ్లు చెమ్మరిల్లాయి. నారాయణగూడ ఠాణా పరిధిలో బుధవారం రోడ్డుప్రమాదంలో చోటుచేసుకున్న విషాదమిది. ఉదయం 9:45 గంటలకు హిమాయత్‌నగర్‌ వైజంక్షన్‌లో సిగ్నల్‌ పడింది. అన్ని వాహనాలతోపాటు ఆర్టీసీ బస్సు కూడా పరుగులు పెడుతోంది. ఇంతలోనే వై.జంక్షన్‌, హిమాయత్‌నగర్‌ వీధి నెంబరు 9కి వెళ్లే దారిలో ముషీరాబాద్‌ డిపో బస్సు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో వాహనంపై ఉన్న గర్భిణి, ఆమె భర్త పడిపోయారు. బస్సు అలాగే ముందుకు పోవడంతో పెద్దపెట్టున కేకలు వినపడగా ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. బస్సు వెనుక చక్రాల కింద గర్భిణి, భర్త కుడివైపు పడి ఉన్నారు. స్థానికులంతా గగ్గోలు పెట్టడంతో వెంటనే డ్రైవర్‌ కమలన్న బస్సును వెనక్కు తీశాడు. ఆ మహిళ అప్పటికే అపస్మారక స్థితిలో ఉంది. బస్సు వెనక చక్రాలు ఆమె కడుపుపైకి ఎక్కడంతో రక్తం వరదలై పారింది. ఆమె పొట్ట భాగం నుజ్జయింది. అటుగా వెళ్తున్న అంబులెన్స్‌లోకి ఆమెను ఎక్కించి హైదర్‌గూడ అపోలో ఆసుపత్రికి తరలించారు. 108లో ఆమె భర్తను కూడా పంపించారు. ఘటనాస్థలిలో దొరికిన వైద్య నివేదిక ఆధారంగా దంపతులు ముషీరాబాద్‌ బాకారంలో ఉండే పి.శాలిని (35), సతీష్‌ గౌడ్‌ (36)గా గుర్తించారు. శాలిని 6 వారాల గర్భిణి. ఉదయం 8:30 గంటలకు హైదర్‌గూడలోని ఫెర్నాండెజ్‌ ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘోరం జరిగింది. దంపతులకు ఏడాది కొడుకు ఉన్నాడు. ఆసుపత్రిలో ఆ తల్లి 8 గంటలపాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. భర్త చికిత్స పొందుతున్నాడు.


శాలిని, సతీష్‌గౌడ్‌

బతుకుతుందేమో అనుకున్నా..

బస్సు చక్రాలు తన కడుపుపైకొచ్చినప్పుడు ఆ తల్లి ఎంత తల్లడిల్లిందో! దాదాపు అయిదారు నిమిషాలు ప్రథమ చికిత్స చేశాను. అప్పుడు కళ్లు తెరిచింది. అటుగా వచ్చిన అంబులెన్స్‌ను ఆపేసి వెంటనే ఆసుపత్రికి తరలించా. కళ్లు తెరిచింది కదా.. బతుకుతుందేమో అనుకున్నా.. పాపం!

- మల్లన్న, నారాయణగూడ ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌

Tags:

మరిన్ని

  • TS: బీర్కూర్‌లో ఒక్కరోజే 60 కొవిడ్‌ కేసులు[21:47]
  • షెడ్యూల్‌ ప్రకారమే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు[21:14]
  • టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM[21:00]
  • అప్రమత్తంగా లేకపోతే మనదీ ‘మహా’ పరిస్థితే![20:10]
  • భోజన ప్రియుల కోసం.. ఓ విమానం![18:11]
  • వైకాపా ఎమ్మెల్యేకు కరోనా..ఐసీయూలో చికిత్స[17:59]
  • ఈ సమయంలో ధర్నాలు చేయొద్దు: ఈటల[17:33]
  • టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM[17:00]
  • ఏపీలో 4,157 కేసులు.. 18 మరణాలు[16:49]
  • కౌలు రైతుగా మాజీ జేడీ లక్ష్మీనారాయణ[13:59]
  • టాప్‌ 10 న్యూస్‌ @ 1PM[12:57]
  • అంబేడ్కర్‌ ఆశయాలు కొనగిస్తున్నాం:కేటీఆర్‌[12:10]
  • తెలంగాణలో కొత్తగా 2,157 కరోనా కేసులు[09:21]
  • టాప్‌ 10 న్యూస్‌ @ 9AM[08:57]
  • హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం[06:08]
  • తెదేపా సభలో రాళ్ల దాడిపై ఆధారాల్లేవ్‌: డీఐజీ[01:15]
  • అన్ని మతాలకు సమాన గౌరవం: కేసీఆర్[01:09]
  • కొవిడ్‌ ఎఫెక్ట్‌: విశాఖ రైల్వేస్టేషన్‌లో మార్పులు[01:05]
  • మీ వాట్సాప్‌ ఖాతాను ఇలా కూడా హ్యాక్‌ చేస్తారు![01:01]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • బుల్లితెర జలపాతంలో సుధీర్‌, రష్మి
  • మూఢ విశ్వాసంతో కన్నబిడ్డలనే కడతేర్చే యత్నం
  • ‘ప్రియుడి ఒత్తిడితోనే కుమార్తె ఆత్మహత్య’
  • ఇజ్రాయెల్..‌ అందుకో టీకా ఫలం‌!
  • మార్కెట్లలో జోష్‌ నింపిన కేంద్రం నిర్ణయం
  • పదేళ్లకే నాకు పెళ్లి చేశారు: నటి కృష్ణవేణి
  • సెకండ్‌ వేవ్‌.. చిత్రసీమపై కరోనా ప్రతాపం
  • గుట్టలుగా మృతదేహాలు.. ఖాళీలేని శ్మశానాలు!
  • వకీల్‌సాబ్‌.. పవన్‌ని హత్తుకున్న తారక్‌!
  • ఐపీఎల్‌ నుంచి స్టోక్స్‌ ఔట్‌
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.