మంగళవారం, జూన్ 02, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

వలస కూలీలకు వేతనం చెల్లించాలని పిటిషన్‌

దిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి  కోల్పోయిన వలస కూలీలకు ప్రభుత్వాలు వేతనం చెల్లించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రవాణా వ్యవస్థ స్తంభించడంతో దేశ వ్యాప్తంగా లక్షలాది మంది వలసకూలీలు సొంతూళ్లకు వెళ్లలేక, ఉన్న ప్రాంతంలో ఉపాధిలేక అల్లాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమాజిక కార్యకర్తలు హర్ష మాందర్‌, అంజలి భరద్వాజ్‌ వలస కూలీల సమస్యలపై సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.
 లాక్‌డౌన్‌ వేళ వలస కార్మికులు తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వారందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేతనాలు ఇవ్వాలని కోరారు. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ దీపక్‌ గుప్తా ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణ ఏప్రిల్‌ 7కు వాయిదా పడింది.

 

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)