శుక్రవారం, మే 29, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

భక్తులు లేకుండానే రామయ్య పట్టాభిషేకం

భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శుక్రవారం రామయ్య పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. లాక్‌డౌన్‌ ప్రభావంతో భక్తులు లేకుండానే మహా పట్టాభిషేకం  నిర్వహించారు. వైదిక పెద్దలు ఆలయ ప్రాంగణంలోనే ఈ క్రతువు నిర్వహించారు. శ్రీరామనవమి తర్వాత రోజు సీతారాముల వారికి పట్టాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని పురస్కరించుకుని సమస్త నదీజలాలతో అభిషేకం చేశారు. నగలు, రాజదండం, రాజముద్రిక చత్రం, శంఖు చక్రాలు, కిరీటంతో రాముడికి ఆలంకరణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ  సలహాదారు రమణాచారి,  దేవాదాయశాఖ కమిషనర్‌  అనిల్‌ కుమార్‌ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారని ఆలయ ఈవో నరసింహులు తెలిపారు.


 

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)