మంగళవారం, జూన్ 02, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

సిటీ బస్సులే సంచార రైతుబజార్లు

 నగరంలో ప్రయోగానికి స్పందన
 మారుమూలకూ వెళ్లేలా వీఎంసీ ప్రణాళిక

విజయవాడ: విజయవాడ నగర పరిధిలో కూరగాయలను వీలైనంత ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వీఎంసీ కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ సంచార రైతుబజార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ సిటీ బస్సులే ఇందుకు వేదికలవుతున్నాయి. దీనికి సంబంధించి ఆర్టీసీ నుంచి బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకుని ప్రయోగ ప్రాతిపదికన గురువారం నిర్వహించారు. వీటికి ప్రజల నుంచి స్పందన కనిపించింది. దీని ఆధారంగా రాబోయే రోజుల్లో మరిన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.
* వీఎంసీ పరిధిలో మొత్తం 64 డివిజన్లు ఉన్నాయి. ఇప్పటికే వీటిలో దాదాపు 53 డివిజన్లను కలుషిత ప్రాంతాలుగా ప్రకటించారు. ఇక్కడి వారిని వెలుపలకు వెళ్లనీయడం లేదు. వీరు కూరగాయల కోసం ఇబ్బంది పడకుండా సంచార రైతుబజార్లను తీసుకొచ్చారు. ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రజల గుమ్మం వద్దకే తీసుకెళ్లొచ్చని భావిస్తున్నారు. దీని వల్ల ఎక్కువ మంది ఒకేచోట గుమికూడాల్సిన అవస్థలు తప్పుతాయి.
* సంచార రైతుబజార్ల నిర్వహణ కోసం ఆర్టీసీ బస్సులు తీసుకోవాలని కమిషనర్‌ నిర్ణయించారు. దీనిపై ఆయన ఇప్పటికే ఆర్టీసీ ఆర్‌ఎం నాగేంద్ర ప్రసాద్‌తో చర్చించారు. తొలి విడతగా 5 సిటీ బస్సులను ఇవ్వాలని కోరారు. దీనికి అనుగుణంగా గురువారం నాడు అందజేశారు. వీటిలో తొలుత సర్కిల్‌1లో ఏర్పాటు చేశారు. ప్రయోగాత్మకంగా ఒకటో పట్టణ పరిధిలోని శివాలయం సెంటర్‌, ఊర్మిళ సుబ్బారావునగర్‌లో పెట్టారు. మొదటి రోజు 8 క్వింటాళ్ల మేర విక్రయాలు సాగాయని తెలిసింది.

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)