శుక్రవారం, మే 29, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

కరోనా మృతుల్లో 95% మంది వృద్ధులే

  ఐరోపాలో పరిస్థితిపై డబ్ల్యూహెచ్‌వో విశ్లేషణ

జెనీవా: ఐరోపాలో కరోనా మహమ్మారి కారణంగా మృతిచెందిన వారిలో 95% మంది 60 ఏళ్ల పైబడినవారేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. వీరిలో సగం మంది 80 ఏళ్ల వయసు దాటినవారేనని, అందునా హృద్రోగం, అధిక రక్తపోటు, మధుమేహంతో వీరు బాధపడుతూ వచ్చారని వివరించింది. 50 ఏళ్లలోపు బాధితుల్లో 10-15% మందికి ఓ మోస్తరు నుంచి తీవ్రస్థాయి వ్యాధి లక్షణాలు కనిపించినట్టు పేర్కొంది. చాలామంది కిశోర బాలలు, 20 ఏళ్ల యువతలోనూ కరోనా తీవ్రస్థాయిలో విరుచుకుపడి, చాలామందిని మృత్యువుపాలు చేసిందని వెల్లడించింది. ఈ వైరస్‌ వృద్ధులకే ఎక్కువగా సోకుతుందని భావించరాదని, మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనేంత దృఢమైన రోగనిరోధక శక్తి ఐరోపా యువతకు లేదని డబ్ల్యూహెచ్‌వో రీజినల్‌ డైరెక్టర్‌ డా.హాన్స్‌ క్లూజ్‌ హెచ్చరించారు. కరోనా సోకిన నూరేళ్ల వయసు వారు కోలుకుంటుండటం సానుకూల పరిణామమని ఆయన చెప్పారు.

Tags:
కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)