శుక్రవారం, మే 29, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

కరోనాపై హెచ్చరించే యాప్‌

ఆరోగ్య సేతును ప్రారంభించిన కేంద్రం

దిల్లీ: కరోనా వైరస్‌ సోకే ముప్పును అంచనా వేసుకోవడంలో ప్రజలకు సహకరించేందుకు, కరోనా సోకిన రోగికి దగ్గరగా వచ్చిన సందర్భంలో అధికారులను అప్రమత్తం చేసే మొబైల్‌ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు గురువారం ఆరోగ్య సేతు యాప్‌ను లాంఛనంగా ఆవిష్కరించింది. ఈ యాప్‌ కేవలం కొత్త కేసులను గుర్తిస్తుందని, కరోనా సోకిన వ్యక్తికి దగ్గరగా ఉన్నవారికి అప్రమత్తత సందేశాలు పంపిస్తుందని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ‘‘ప్రతి భారతీయుడి ఆరోగ్యం, సంక్షేమం కోసం ఆరోగ్య సేతు యాప్‌ డిజిటల్‌ ఇండియాలో చేరింది. కరోనా వైరస్‌ బారిన పడే ముప్పు తమకు ఎంత ఉందనే విషయాన్ని దీనిద్వారా ప్రజలు తెలుసుకోవచ్చు. ఇతరులతో కలిసే సందర్భాలను బట్టి వారు వైరస్‌ బారినపడే ముప్పును యాప్‌ గణిస్తుంది. అత్యాధునిక బ్లూటూత్‌ టెక్నాలజీ, అల్గోరిథమ్స్‌, కృత్రిమ మేధల ఆధారంగా ఇది సాధ్యమవుతంది’’ అని గురువారమిక్కడ ఓ అధికారిక ప్రకటన వెలువడింది. ఒక వ్యక్తికి పరీక్షలు నిర్వహించాక కొవిడ్‌-19 బారిన పడినట్లు తేలితే.. వెంటనే అతని  వివరాలతోపాటు మొబైల్‌ నంబర్‌ను ఆరోగ్య మంత్రిత్వశాఖ రికార్డులతోపాటు యాప్‌లోనూ నమోదు చేస్తారు. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ వినియోగదారులకూ ఆరోగ్య సేతు యాప్‌ అందుబాటులో ఉంది.

Tags:
కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)