ఇంటర్నెట్ డెస్క్: ఒడిశా రాష్ట్రం కోర్దా జిల్లాలోని జాతీయ రహదారిపై రెండు ఏనుగులు హల్‌చల్ చేశాయి. దాలీపుర్ సమీపంలోని అడవిలోనుంచి రెండు గజరాజులు రహదారిపైకి వచ్చాయి. కలియ తిరుగుతూ రోడ్డును దిగ్బంధం చేశాయి. ఏనుగుల చేష్టలతో వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు 2 గంటల పాటు రోడ్డు పైనే వేచి ఉండాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది అక్కడికి చేరుకొని గజరాజులను అడవిలోకి పంపించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి...