శుక్రవారం, మే 29, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఏపీలో కొలిక్కి వచ్చిన దిల్లీ బాధితుల వివరాలు

అమరావతి: కొవిడ్‌-19పై ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష ముగిసింది. మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకటరమణ తదితరులు సమీక్షకు హాజరయ్యారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా చేపట్టాల్సిన మరిన్ని నివారణ చర్యలపై చర్చించారు. అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడుతూ వివరాలు సమావేశం వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలోని ఇప్పటి వరకు 161 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. అందులో 140 కేసులు దిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారివేనని స్పష్టం చేశారు. ‘‘మత ప్రార్థనలకోసం దిల్లీ వెళ్లిన 1085 మందిలో 946 మంది ప్రస్తుతం రాష్ట్రంలోనే ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు 881 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించాం. 881లో 108 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 65 మందికి సంబంధించి ఫలితాలు రావాల్సి ఉంది. 139 మంది ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. దిల్లీ వెళ్లి వచ్చిన వారితో కాంటాక్ట్‌లో ఉన్న 616 మందిని గుర్తించాం. వారిలో 32 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మిగిలిన 335 మందికి సంబంధించి రిపోర్టులు రావాల్సి ఉంది’’ అని మంత్రి వివరించారు.

‘‘వాలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలతో నిర్వహిస్తున్న సర్వే వివరాలు సీఎం తెలుసుకున్నారు. కేంద్రం అనుమతించిన నేపథ్యంలో గుంటూరు, కడపలో అదనంగా టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. త్వరలో విశాఖలో కూడా ల్యాబ్‌ ప్రారంభమవుతుంది. సోమవారం  నుంచి రాష్ట్రంలో ఏడు ల్యాబ్‌లో అందుబాటులోకి వస్తాయి. అన్నీ అందుబాటులోకి వస్తే దాదాపు రోజుకు 900 మందికి కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది’’ అని మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)