మంగళవారం, జూన్ 02, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

కేటీఆర్‌ ట్వీట్‌.. కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌

వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న పోలీస్‌ కానిస్టేబుల్‌ అశోక్‌.. పట్టణానికి చెందిన మురళీకృష్ణ అనే వ్యక్తిపై దాడి చేసిన ఘటనలో ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా ఎస్పీ అపూర్వరావు ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం సాయంత్రం మురళీకృష్ణ అనే వ్యక్తి నగరంలోని రామాలయం నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు తన కుమారుడితో ద్విచక్రవాహనంపై రెండు నుంచి మూడు సార్లు రాకపోకలు సాగించాడు. ఇది గమనించిన పోలీసులు మురళీకృష్ణను ఆపి లాక్‌డౌన్‌ సమయంలో బాలుడిని వెంటబెట్టుకొని తిరగడం సరికాదని హెచ్చరించారు. అదే సమయంలో మురళీకృష్ణ ద్విచక్రవాహనంపై 14 పెండింగ్‌ చలాన్లు ఉన్నాయంటూ కానిస్టేబుల్‌ అశోక్‌  నిలదీశారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ తారస్థాయికి చేరి ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు.

అయితే అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఆ ఘర్షణను వీడియో తీసి ట్విటర్‌ ద్వారా మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాడు. స్పందించిన కేటీఆర్‌ ఘటనపై చర్యలు తీసుకోవాలని హోం మంత్రి మహమూద్‌ అలీ, డీజీపీని కోరారు. ఈ ఘటనపై స్పందించిన వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణ అనంతరం కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌, డీజీపీకి వనపర్తి ఎస్పీ ట్విటర్‌ ద్వారా తెలిపారు.

ఇదీ చదవండి...

వనపర్తి పోలీసుల తీరుపై కేటీఆర్‌ ఆగ్రహం


కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)