గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

కరోనా కాలంలో పోలీసుల పాత్ర కీలకం

హైదరాబాద్: కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్న పోలీసులను హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్ విధుల్లోకి ఆహ్వానించారు. నగరంలోని పశ్చిమ మండల పరిధిలోని పలు పోలీస్టేషన్లకు చెందిన 45 మంది సిబ్బంది సీపీ ఆధ్వర్యంలో తిరిగి తమ విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కాలంలో పోలీసుల పాత్ర కీలకమైందని తెలిపారు. భయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ నుంచి రక్షించుకోవచ్చని ఆయన వెల్లడించారు. 

దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో కరోనా ప్రభావం తక్కువగా ఉందని అంజనీకుమార్‌ అభిప్రాయపడ్డారు.లాక్ డౌన్, నియంత్రణ ప్రదేశాలు, వలస కూలీల తరలింపులో పోలీసులు ఎంతో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. వైరస్‌ నుంచి కోలుకున్న వాళ్ళు ఇతరులకు కరోనా గురించి అవగాహన కల్పించి ధైర్యం చెప్పాలని అంజనీకుమార్‌ కోరారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని