శుక్రవారం, మే 29, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. ఆయుధాల్లేకుండా యుద్ధానికి పంపడం న్యాయమా?

 కరోనా మహమ్మారి తీవ్రంగా ప్రభావం చూపుతున్న తరుణంలో తమ ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిసినా ఆ రోగులకు వైద్యులు, సిబ్బంది సేవలందిస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అలాంటి వైద్యులు, సిబ్బందికి అవసరమైన పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచకపోవడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.‘ఆయుధాలు లేకుండా సైనికులను యుద్ధానికి పంపడం న్యాయమా? అలాగే వైద్య సిబ్బందికి అవసరమైన పీపీఈలు ఇవ్వకుండా వైరస్‌తో యుద్ధం చేయించాలనుకోవడం ధర్మం కాదు. వారిని ఆపదలోకి నెట్టేయకుండా అవసరమైన అన్ని రక్షణ చర్యలు చేపట్టాలి’ అని ఏపీ ప్రభుత్వానికి పవన్‌ విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వైద్య,పోలీస్‌ శాఖల ఉద్యోగులకు పూర్తి వేతనం

తెలంగాణలో వైద్యఆరోగ్య, పోలీస్‌ శాఖల ఉద్యోగులకు పూర్తి వేతనం చెల్లిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నట్టు ఇటీవల సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వైద్య, పోలీస్‌ శాఖలు అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా సేవలందిస్తున్నందున వారికి పూర్తి వేతనాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏపీలో రేపటి నుంచి నగదు పంపిణీ:పుష్పశ్రీవాణి

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా ప్రజ‌లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ ప‌రంగా అన్ని చ‌ర్యలు తీసుకుంటున్నామ‌ని ఏపీ ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ‌వాణి తెలిపారు. రైతు బ‌జార్ల వికేంద్రీక‌ర‌ణలో భాగంగా విజ‌య‌న‌గ‌రంలోని రాజీవ్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన కూర‌గాయ‌ల మార్కెట్‌ను ఆమె శుక్రవారం ప‌రిశీలించారు. క‌రోనా నియంత్రణ‌కు లాక్‌డౌన్‌ను అమ‌లు చేసిన నేప‌థ్యంలో పేద‌లు ఇబ్బంది ప‌డ‌కుండా తెల్ల రేష‌న్‌ కార్డు క‌లిగిఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.1000 అంద‌జేయనుందని..  రేపటి నుంచి నగదు పంపిణీ ప్రారంభ‌మ‌వుతుంద‌ని వెల్లడించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఏపీలో తొలి కరోనా మరణం నమోదు

4. మా పిల్లల పేర్లు కరోనా, కొవిడ్‌...

కరోనా, కొవిడ్‌... ప్రస్తుతం ఈ పేర్లు వింటే ప్రపంచం మొత్తం వణికిపోతోంది. గత డిసెంబర్‌లో చైనాలో పుట్టిన కొత్త వ్యాధి కరోనా వైరస్‌ (కొవిడ్-19). ఇప్పటికే ప్రపంచంలోని 200 దేశాల్లో పది లక్షల మందికి సోకింది. కరోనా కాటుకు ఇప్పటికే 51,000 మంది బలయ్యారు. అయితే ఇవేమీ పట్టించుకోని జంట ఒకరు తమకు పుట్టిన కవల పిల్లలకు ఆ వ్యాధిపేరే పెట్టుకోవటం విశేషం. వివరాల్లోకి వెళితే... ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన ఓ జంటకు మార్చి 27న తెల్లవారుఝామున కవల పిల్లలు పుట్టారు. వారిలో ఒకరు అమ్మాయి, మరొకరు అబ్బాయి. వారిలో అబ్బాయికి కొవిడ్‌ అని... అమ్మాయికి కరోనా అని పేరు పెట్టినట్టు ఆ బిడ్డల తల్లి ప్రీతి వర్మ చెప్పారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కరోనా: భారత్‌కు ప్రపంచబ్యాంకు భారీ సహాయం

భారత్‌లో కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) వ్యతిరేక పోరాటానికి గానూ ప్రపంచ బ్యాంకు 1 బిలియన్‌ డాలర్ల భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 25 అభివృద్ధి చెందుతున్న దేశాలకు కేటాయించిన అత్యవసర సహాయ నిధిలో తొలివిడతగా 1.9 బిలియన్ డాలర్లను సంస్థ విడుదల చేయనుంది. ఈ నిధులతో 40 దేశాల్లో కరోనా నిరోధక ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. కాగా, ఇందులో అధిక భాగం అంటే 1 బిలియన్ డాలర్లను భారత్‌కు కేటాయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు:ఏపీ డీజీపీ

కరోనాపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌ హెచ్చరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట గరికపాడులో ఏపీ-తెలంగాణ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద లాక్‌డౌన్‌ పరిస్థితులు, భద్రతను డీజీపీ పరిశీలించారు. అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శ్రీకాకుళం, నాగార్జునసాగర్‌, విజయనగరం జిల్లా సాలూరు, ఇతర చెక్‌పోస్టుల సిబ్బందితో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతమున్న విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక వర్గం లేదా ఒక వ్యక్తిని టార్గెట్‌ చేస్తూ ఎలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని డీజీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఏపీలో కొలిక్కి వచ్చిన దిల్లీ బాధితుల వివరాలు

7. లక్ష మృతదేహాల సంచులకు అమెరికా ఆర్డర్‌

ప్రపంచ కరోనా బాధితుల్లో పావు వంతు అమెరికన్లే కావడం కలవరపెడుతోంది. అక్కడ మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే 6000కు పైగా మృతిచెందారు. జాన్‌ హప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం ప్రకారం గురువారం ఒక్కరోజే 1,100కి పైగా ప్రాణాలు కోల్పోయారు. వైట్‌హౌస్‌ విశ్లేషకులైతే లక్ష నుంచి రెండున్నర లక్షల మంది అమెరికన్లు కరోనాకు బలవుతారని అంచనా వేస్తున్నారు. మృతదేహాల కోసం లక్ష సంచులు కావాలని అమెరికా విపత్తు స్పందన సంస్థ ‘ఫెమా’ ఆ దేశ సైన్యాన్ని కోరడం గమనార్హం. ఆ దేశంలో దాదాపు 85% మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఎదురుగా ఏనుగు వస్తోందని తెలియక..!

రోడ్డుపై ఎదురుగా ఏనుగు.. దాన్ని చూసిన వారెవరైనా ధైర్యంగా అడుగు ముందుకేస్తారా? కష్టమే. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌ శివార్లలో ఓ పాల వ్యాపారికి కూడా అనుకోకుండా ఇలాంటి అనుభవమే ఎదురైంది. ద్విచక్ర వాహనంపై వస్తోన్న అతడు ఎదురుగా వస్తున్న ఏనుగును గమనించకుండా దగ్గరికి వచ్చేశాడు. ఆపై ఏనుగును చూసి షాకయ్యాడు. వాహనాన్ని అక్కడే వదిలేసి.. పరుగులు తీశాడు. ఈ ఘటనను రోడ్డు పక్కనున్న ఇంటిపై నుంచి కొందరు చిత్రీకరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. క్రీడా ప్రముఖులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌

రోనా వైరస్‌పై చేస్తున్న పోరాటంలో క్రీడా ప్రముఖులు మద్దతివ్వాలని, సానుకూలత సందేశాలతో ప్రజల్లో చైతన్యం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజుజుతో సహా మోదీ 49 మంది క్రీడా ప్రముఖులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కొవిడ్‌-19 మానవాళికి విరోధి అని, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒలింపిక్స్‌ వాయిదా పడిన పరిస్థితే దాన్ని తీవ్రతకు అద్దం పడుతోందని అన్నారు. మైదానంలో పోరాడి దేశానికి కీర్తి తెచ్చిన విధంగానే ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లోనూ పోరాడాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మా మాట కూడా వినండి మోదీజీ: చిదంబరం

10. త్రిష డ్యాన్స్‌అదుర్స్‌..టిక్‌టాక్‌ వీడియో వైరల్‌!

అగ్ర కథానాయిక త్రిష ఫేమస్‌ వీడియో మేకింగ్‌ ఫ్లాట్‌ఫాం టిక్‌టాక్‌లోకి అడుగుపెట్టారు. ప్రముఖ హాలీవుడ్‌ గాయని మేగాన్ నీ స్టాలియన్ ఆలపించిన ‘సేవేజ్..’కు డ్యాన్స్‌ చేసి.. తొలి వీడియోను పోస్ట్‌ చేశారు. ఊదా రంగు, నలుపు రంగు స్కట్‌లో చేసిన డ్యాన్స్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. దీంతో ఆమె టిక్‌టాక్‌ వీడియో వైరల్‌గా మారింది. ‘వావ్‌ టిక్‌టాక్‌లోకి త్రిష, డ్యాన్స్‌ అదుర్స్‌, సూపర్‌, లుక్‌ క్యూట్‌గా ఉంది..’ అంటూ రకరకాల కామెంట్లు చేశారు. లాక్‌డౌన్‌ కాలాన్ని త్రిష ఇంట్లో తన కుటుంబ సభ్యులు, పెంపుడు జంతువులతో గడుపుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)