గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం: కేటీఆర్‌

హైదరాబాద్‌: గత ఆరేళ్లుగా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు భిన్నంగా పెట్టుబడులను ఆకర్షిస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో పరిశ్రమలకు ప్రభుత్వం అండగా ఉంటోందన్నారు. యూఎస్‌ ఐబీసీ ఇన్వెస్ట్‌మెంట్‌ వెబినార్‌లో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికన్‌ కంపెనీల అధినేతలతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. రాష్ట్రంలో లైఫ్‌ సైన్సెస్, ఫార్మా రంగాలకు బలమైన వ్యవస్థ ఉందని,  ప్రస్తుతం చాలా దేశాలు హైదరాబాద్‌ కంపెనీల ఔషధాలపై  
ఆధారపడ్డాయని కేటీఆర్‌ చెప్పారు.తెలంగాణలో పెట్టుబడుల వాతావరణాన్ని అమెరికన్‌ కంపెనీలు ప్రశంసించాయి. పెట్టుబడులకు తెలంగాణ అనువైన ప్రదేశమని అమెరికన్‌ కంపెనీల అధినేతలు అభిప్రాయపడ్డారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని