గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. కరోనా కాలంలో పోలీసుల పాత్ర కీలకం

కరోనా మహమ్మారి బారిన పడి కోలుకున్న పోలీసులను హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్ విధుల్లోకి ఆహ్వానించారు. నగరంలోని పశ్చిమ మండల పరిధిలోని పలు పోలీస్టేషన్లకు చెందిన 45 మంది సిబ్బంది సీపీ ఆధ్వర్యంలో తిరిగి తమ విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కాలంలో పోలీసుల పాత్ర కీలకమైందని తెలిపారు. భయపడకుండా జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ నుంచి రక్షించుకోవచ్చని ఆయన వెల్లడించారు. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో కరోనా ప్రభావం తక్కువగా ఉందని అంజనీకుమార్‌ అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బఫెట్‌ను వెనక్కి నెట్టేసిన ముఖేశ్‌ అంబానీ

భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేశ్‌ అంబానీ అరుదైన ఘనత సాధించారు. సంపన్నుల జాబితాలో ఆయన అపర దానకర్ణుడిగా పేరుగాంచిన వారెన్‌ బఫెట్‌ను వెనక్కినెట్టారు. బ్లూమ్‌బర్గ్‌ సంపన్నుల సూచీ ప్రకారం ప్రపంచ కుబేరుల్లో ఎనిమిదో స్థానానికి చేరుకున్నారు. ఆసియా నుంచి టాప్‌-10లో ఉన్న ఒకే ఒక్కరు ముఖేశ్‌ కావడం గమనార్హం. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ను రుణరహిత సంస్థగా మార్చాలని కంకణం కట్టుకున్న ముఖేశ్‌ ఆ పనిలో విజయవంతమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సంస్థ విలువ 68.3 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. బఫెట్‌ సంస్థ బెర్క్‌షైర్‌ హాథ‌వే 67.9 బిలియన్‌ డాలర్లను దాటేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నిషేధానికి ముందే చైనా యాప్‌లకు దెబ్బ

భారత్‌లో నిషేధానికి ముందే చైనా యాప్‌ల వాడకం తగ్గిందని నీల్సన్‌ మీడియా సర్వే తెలిపింది. గల్వాన్‌ లోయలో డ్రాగన్‌తో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైనప్పటి నుంచే తగ్గుదల చోటుచేసుకుందని వెల్లడించింది. లద్దాఖ్‌ సమీపంలోని గల్వాన్‌ లోయలో జూన్‌ 15న చైనా, భారత సైనికులు బాహాబాహీకి దిగారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చైనాపై ఆగ్రహం తెప్పించిన సంగతి తెలిసిందే. దుందుడుకు డ్రాగన్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే సమాచార భద్రత, వ్యక్తిగత గోప్యత, దేశ సార్వభౌమత్వానికి భంగం వాటిల్లుతోందని 59 చైనీస్‌ యాప్‌లను జూన్‌29న నిషేధించింది.  కాగా గల్వాన్‌ ఘటన నుంచే యాప్‌ల వినియోగం తగ్గిందని నీల్సన్‌ మార్కెట్‌ సర్వే తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నేపాల్‌ అధికార పార్టీలో చీలిక తప్పదా?

నేపాల్‌ ప్రధాని కె.పి.శర్మ ఓలీ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సీపీ) స్టాండింగ్‌ కమిటీ సమావేశం మరోసారి వాయిదా పడింది. నేడు జరగాల్సిన  భేటీని వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఇలా ఈ సమావేశం వాయిదా పడడం ఇది ఐదోసారి. ప్రధాని ఓలీ, పార్టీ ఛైర్మన్‌ పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ మధ్య ఏర్పడ్డ తీవ్ర స్థాయి విభేదాలు పరిష్కారం కాకపోవడమే దీనికి కారణమని సమాచారం.  ఇలా చర్చల్లో నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతుండడంతో పార్టీ చీలిక దిశగా సాగుతున్నట్లు వస్తున్న ఊహాగానాలు బలపడుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. #MeToo ఆరోప‌ణ‌లు: సియోల్ మేయ‌ర్ ఆత్మ‌హ‌త్య‌!

ద‌క్షిణ కొరియా అధ్య‌క్షుడి రేసులోఉన్న వ్య‌క్తి, సియోల్ న‌గ‌ర మేయ‌ర్ పార్క్‌-వోన్‌-సూన్ (64) ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. త‌న‌పై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు వ‌చ్చిన మ‌రుస‌టిరోజే పార్క్ త‌నువు చాలించారు. న‌గ‌రంలోన ఓ ప‌ర్వ‌త ప్రాంతంలో పార్క్ మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. అనంత‌రం మేయ‌ర్ అధాకారిక‌ నివాసంలో ల‌భ్య‌మైన‌ సూసైడ్ నోట్‌ను అధికారులు విడుద‌ల చేశారు. ‘ప్ర‌తి ఒక్కరూ న‌న్ను క్ష‌మించండి. నా సుదీర్ఘ జీవితకాలంలో నాతో పాటు ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా. అత్యంత బాధ క‌లిగించినందుకు నా కుటుంబస‌భ్యులు కూడా న‌న్ను క్ష‌మించండి' అని సూసైడ్ నోట్‌‌లో పార్క్ పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 13 ఏళ్ల కుర్రాడిగా నా అదృష్టాన్ని నమ్మలేకపోయా  

టీమ్‌ఇండియా దిగ్గజ బ్యాట్స్‌మన్‌ సునీల్‌ గావస్కర్‌ 71వ పుట్టిన రోజు సందర్భంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ఆయనకు శుభాకాంక్షలు చెప్పాడు. గావస్కర్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న లిటిల్‌మాస్టర్‌ ఈ సందర్భంగా  తాను  తొలిసారి అతడిని కలుసుకున్న అనుభవాన్ని గుర్తుచేసుకున్నాడు. ‘1987లో గావస్కర్‌ సర్‌ను తొలిసారి కలిసే అవకాశం దక్కింది. 13 ఏళ్లు కుర్రాడిగా ఆ రోజు నా అదృష్టాన్ని నమ్మలేకపోయా. నేను ఎవరినైతే అభిమానిస్తూ పెరిగానో, ఎవరంతటి గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకోవాలనుకున్నానో ఆ క్రికెటర్‌ను కలుస్తున్నానని ఆశ్చర్యపోయా’ అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కరోనా తగ్గలేదో.. మంత్రివర్గం రద్దే!

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కజఖ్‌‌స్థాన్‌ అధ్యక్షుడు కస్యైమ్‌ జొమార్ట్‌ టొకయేవ్‌ కఠిన నిర్ణయం తీసుకున్నారు. కొవిడ్‌-19 నుంచి విముక్తి పొందేందుకు రెండోసారి అమలు చేయబోతున్న రెండువారాల లాక్‌డౌన్‌ విఫలమైతే మంత్రివర్గాన్ని పూర్తిగా రద్దు చేస్తానని హెచ్చరించారు. ‘రెండో లాక్‌డౌన్‌ ముగిశాక మెరుగుదల లేకపోతే ప్రభుత్వ సామర్థ్యం, మంత్రివర్గ కూర్పుపై సందేహాలు తలెత్తుతాయి’ అని అధ్యక్షుడు టొకయేవ్‌ అన్నారు. ప్రస్తుతం కజఖ్‌‌స్థాన్‌లో 55,000 కేసులు ఉన్నాయి. 264 మంది మృతిచెందారు. గురువారం రోజు కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. జులై 5 నుంచి అక్కడ రెండో విడత లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నేపాల్‌: కొండ‌చరియ‌లు విరిగిప‌డి 44మంది గ‌ల్లంతు!

నేపాల్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి క‌స్కీ జిల్లాలో చాలా ప్రాంతాల్లో కొండ‌చరియ‌లు విరిగిప‌డుతున్నాయి. ఈ ఘ‌ట‌న‌ల్లో ఇప్ప‌టికే 12మంది మృతిచెందగా మ‌రో 19మంది వాటిలో చిక్కుకుపోయిన‌ట్లు అక్క‌డి పోలీసులు వెల్ల‌డించారు. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున కురిసిన భారీ వ‌ర్షాల‌కు కొండచరియ‌లు విరిగి నివాస స్థ‌లాల‌పై ప‌డ‌డంతో చాలా ఇళ్లు నేల‌మ‌ట్ట‌మ‌య్యాయి. దీంతో చాలామంది వాటికింద‌  చిక్కుకుపోయిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టివ‌రకు 44మంది గ‌ల్లంతైన‌ట్లు గుర్తించామ‌ని, ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఇద్దరు అంపైర్లు.. ఐదు తప్పుడు నిర్ణయాలు

కరోనా వైరస్‌ కారణంగా ఏర్పడిన విరామం అనంతరం.. సుమారు నాలుగు నెలల తర్వాత క్రికెట్‌ ప్రారంభమైంది. ఇది సంతోషించాల్సిన విషయమే అయినా ఐసీసీ కొత్త నిబంధనల కారణంగా ఇప్పుడు ఆటలో కొత్త తలనొప్పులు మొదలయ్యేలా కనిపిస్తున్నాయి. బౌలర్లు బంతికి మెరుపు తీసుకురావడానికి ఉమ్ము రాయొద్దని, అలాగే మ్యాచ్‌లు నిర్వహించే దేశం స్థానిక అంపైర్లను వినియోగించుకోవాలని ఐసీసీ కొత్త మార్గదర్శకాల్లో పేర్కొంది. దీంతో బుధవారం నుంచి ఇంగ్లాండ్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య ప్రారంభమైన తొలి టెస్టులో ఆతిథ్య జట్టు ఇద్దరు అంపైర్లను నియమించుకుంది. రిచర్డ్‌ కెటిల్‌బారో, రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. టిక్‌టాక్‌కు కేంద్రం 79 ప్రశ్నలు!

భద్రతా కారణాల రీత్యా చైనాకు చెందిన 59 యాప్స్‌పై నిషేధం విధించిన కేంద్రం.. తాజాగా ఆయా సంస్థలకు 79 ప్రశ్నలతో రూపొందించిన నోటీసును పంపించింది. మూడు వారాల్లోగా ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ సూచించింది. జులై 22లోపు వీటికి బదులు ఇవ్వకుంటే పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తామని నోటీసుల్లో పేర్కొంది. ఇందులో ఆయా కంపెనీల కార్పొరేట్‌ మూలాలు, మాతృ సంస్థ, ఫండింగ్‌, డేటా మేనేజ్‌మెంట్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. ఒకసారి ఆయా యాప్స్‌ సమాధానం ఇచ్చాక ప్రత్యేకంగా ఏర్పాటైన కమిటీ వాటిని పరిశీలిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని