మంగళవారం, జూన్ 02, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 AM

1. జన్‌ధన్‌ ఖాతాల్లో  నగదు జమ

కరోనా మహమ్మారి నేపథ్యంలో పీఎం గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీలో భాగంగా మహిళల పేరిట ఉన్న జన్‌ధన్‌ ఖాతాల్లో నగదు జమకానుంది. మూడు నెలల పాటు నెలకు రూ.500 చొప్పున ఇచ్చే ఈ ప్యాకేజీ తొలివిడత నగదు గురువారానికి ఆయా ఖాతాల్లో జమ చేయాలని కేంద్రం బ్యాంకులకు సూచించింది. బ్యాంకులు, బిజినెస్‌ కరస్పాండెంట్లు, ఏటీఎంల వద్ద నగదు తీసుకునేందుకు కొన్ని షరతులు పెట్టింది. బ్యాంకుల నుంచి ఎస్‌ఎంఎస్‌ వచ్చిన ఖాతాదారులు నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎవరు ఏ తేదీన తీసుకోవచ్చో ఖాతా చివరి నంబరు ప్రకారం బ్యాంకులు షెడ్యూల్‌ తయారు చేశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. చెదురుతున్న అమెరికా స్వప్నం

స్వదేశంలో బీటెక్‌... అమెరికాలో ఎంఎస్‌...ఆ తర్వాత మూడేళ్లపాటు ఓపీటీ... శిక్షణలో ఉండగానే హెచ్‌1బీ వీసాకు దరఖాస్తు. మూడేళ్లపాటు హెచ్‌1బీ వస్తే...మరోమారు మూడేళ్లు పొడిగింపు. అదే సమయంలో పనిచేసే కంపెనీ ఆమోదంతో గ్రీన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవడం.... అది పెండింగ్‌లో ఉన్నంత కాలం హెచ్‌1బీ వీసా గడువును పొడిగించుకుంటూ ఉండటం... ప్రస్తుతం అమెరికాలోని భారతీయ ఉద్యోగులు పాటించే వరుస ఇదే. అమెరికాలో 2021 ఆర్థిక సంవత్సరానికి హెచ్‌1బీ వీసా కింద ఎవరు ఎంపికయ్యారో అమెరికా పౌరసత్వం, విదేశీ సేవల విభాగం(యూఎస్‌ఐసీఎస్‌) తాజాగా వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బియ్యం కార్డులకే ఆర్థిక సాయం

బియ్యం కార్డు జాబితా ఆధారంగానే ప్రస్తుతం ఆర్థిక సాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ (విపత్తు నిర్వహణ)శాఖ సిద్ధమవుతోంది. ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీ కోసం ఏళ్ల కిందట 1.47 కోట్ల రేషన్‌కార్డులనిచ్చారు. ఈ రేషన్‌కార్డులను పక్కన పెట్టేసి వైఎస్సార్‌ నవశకం కింద 1.29 కోట్ల కుటుంబాలకు ఇటీవల బియ్యం కార్డులను ఇచ్చారు. ఇప్పుడు వాటినే ఆర్థిక సాయానికి రెవెన్యూ శాఖ ప్రామాణికంగా తీసుకుంటోంది. ఫలితంగా రాష్ట్రంలోని 18 లక్షల కుటుంబాలకు ఇంటికి రూ.వెయ్యి చొప్పున అందని పరిస్థితి ఏర్పడింది. రేషన్‌ కార్డుల జాబితా ప్రకారం రూ.1,470 కోట్లు అవసరం కాగా ఇప్పుడు రూ.1,300 కోట్లనే ప్రభుత్వం కేటాయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. శంషాబాద్‌ విమానాశ్రయంలో 15 నుంచి సేవలు ప్రారంభం!

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ నెల 15 నుంచి కార్యకలాపాలు ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వైరస్‌ కట్టడి కోసం గత నెల 24న విమానాశ్రయంలో పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేశారు. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 14తో ముగుస్తుండడంతో 15 నుంచి దేశీయ విమాన సర్వీసుల రాకపోకలు ప్రారంభించడానికి అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యాలు దేశీయ విమాన సర్వీసుల టికెట్లను సైతం ఆన్‌లైన్‌లో విక్రయానికి పెట్టాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మహమ్మారిని తరిమేందుకు  ప్రాచీన ఉపాయాలెన్నో!

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మన దగ్గర ప్రాచీన ఉపాయాలు ఎన్నో ఉన్నాయని రామచంద్రమిషన్‌ అధ్యక్షులు, ఆధ్యాత్మిక మార్గదర్శి కమలేశ్‌ డి. పటేల్‌ వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కాన్హా గ్రామంలోని శాంతి వనంలో ఉన్న హార్ట్‌ఫుట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో రామచంద్ర మిషన్‌ నడుస్తోంది. కరోనా నేపథ్యంలో గురువారం ఆయన ప్రాచీన విధానాల గురించి వెల్లడించారు. కరోనా వైరస్‌ నాసికా రంధ్రాల్లోకి, గొంతులోకి ప్రవేశిస్తుంది. రెండు మూడు రోజుల వరకు అక్కడే ఉంటుంది. తర్వాత వైరస్‌ల సంఖ్య పెరిగి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కరోనా మృతుల్లో 95% మంది వృద్ధులే

ఐరోపాలో కరోనా మహమ్మారి కారణంగా మృతిచెందిన వారిలో 95% మంది 60 ఏళ్ల పైబడినవారేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. వీరిలో సగం మంది 80 ఏళ్ల వయసు దాటినవారేనని, అందునా హృద్రోగం, అధిక రక్తపోటు, మధుమేహంతో వీరు బాధపడుతూ వచ్చారని వివరించింది. 50 ఏళ్లలోపు బాధితుల్లో 10-15% మందికి ఓ మోస్తరు నుంచి తీవ్రస్థాయి వ్యాధి లక్షణాలు కనిపించినట్టు పేర్కొంది. చాలామంది కిశోర బాలలు, 20 ఏళ్ల యువతలోనూ కరోనా తీవ్రస్థాయిలో విరుచుకుపడి, చాలామందిని మృత్యువుపాలు చేసిందని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వేతన గండం గడిచేదెలా?

అత్యవసరాలుగా ప్రకటించిన సేవలు, ఉత్పత్తులకు సంబంధించిన సంస్థలు మినహా మిగిలినవన్నీ కరోనా లాక్‌డౌన్‌ వల్ల మూతబడే ఉన్నాయి. మార్చి 21న జనతా కర్ఫ్యూతో ప్రారంభించి, ఏప్రిల్‌ 14 వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. ఇందువల్ల వేతనాలు అందక చిన్న సంస్థల్లోని ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్లిష్ట సమయంలో ఉద్యోగులను తొలగించవద్దని, వారికి వేతనాలు పూర్తిగా అందచేయాలని ప్రభుత్వం కోరింది. ఉద్యోగులు విధులకు రాకున్నా, వచ్చినట్లే పరిగణించాలని కోరడంతో, పనిచేస్తున్న కంపెనీల్లో కూడా కొందరు గైర్హాజరవుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘డక్‌వర్త్‌ లూయిస్‌’లో లూయిస్‌ ఇక లేరు

క్రికెట్లో ఉపయోగించే ‘డక్‌వర్త్‌ లూయిస్‌’ విధానం రూపకర్తల్లో ఒకరైన టోనీ లూయిస్‌ కన్నుమూశారు. ఆయన వయసు 78 ఏళ్లు. ‘‘లూయిస్‌ మృతి చెందారని చెప్పడానికి విచారిస్తున్నాం. ఫ్రాంక్‌ డక్‌వర్త్‌తో కలిసి 1997లో ఆయన డక్‌వర్త్‌-లూయిస్‌ విధానాన్ని సృష్టించారు. 1999లో ఐసీసీ ఆ విధానాన్ని అధికారికంగా అమల్లోకి తెచ్చింది’’ అని ఇంగ్లాండ్‌ బోర్డు చెప్పింది. క్రికెట్‌కు లూయిస్‌ ఎంతో సేవ చేశారని ఐసీసీ జనరల్‌ మేనేజర్‌ జెఫ్‌ అలార్దిస్‌ అన్నాడు. డక్‌వర్త్‌, లూయిస్‌ల రిటైర్మెంట్‌తో స్టీవెన్‌ స్టెర్న్‌.. డక్‌వర్త్‌ లూయిస్‌ విధానానికి పర్యవేక్షుడయ్యాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వినోదాల ‘విన్‌’దు

వినోద రంగంలో ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) మాధ్యమాల హవా కొనసాగుతున్న కాలమిది. అంతర్జాలం అనుసంధానంతో నడిచే ఈ డిజిటల్‌ మాధ్యమాల ద్వారా వెబ్‌ సిరీస్‌లు, సినిమాలు, ఇతర ప్రదర్శనలు చూస్తూ తనివితీరా వినోదాన్ని ఆస్వాదిస్తున్నాడు ప్రేక్షకుడు.  ప్రస్తుతం కరోనాపై పోరు కోసం దేశం మొత్తం లాక్‌డౌన్‌ పాటిస్తోంది. థియేటర్లు, పార్కులు, పర్యాటక స్థలాలు అన్నీ బంద్‌ అవటంతో కుటుంబ సభ్యులు అందరూ ఇంటికే అతుక్కుపోయారు. ఇప్పుడు ఇంటిల్లిపాదికి వినోదానికి లోటు లేకుండా చేస్తోంది ఓటీటీ మాధ్యమాలే. వాటిలో తెలుగు ప్రేక్షకుల్ని మరింతగా అలరిస్తోంది... ETV WIN యాప్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. విరాళం పేరుతో మోసం

సైబర్‌ నేరగాళ్లు కరోనా మహమ్మారి పేరుతోనూ సొమ్ము చేసుకొనే పనిలో పడ్డారు. కరోనా కట్టడి ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా పౌరులు విరాళాలు ఇచ్చేందుకు రూపొందించిన ప్రధానమంత్రి సహాయనిధి ఖాతాకు నకిలీ తయారుచేసి అమాయకులను బురిడీ కొట్టించేందుకు సైబర్‌ దొంగలు ప్రయత్నిస్తున్నారు. ఒక అక్షరం తేడాతో వారు నకిలీ ఐడీని సృష్టించినట్లు రెండురోజుల క్రితం దిల్లీ సైబర్‌క్రైమ్‌ పోలీసులు కనిపెట్టారు. పౌరులు అందించే విరాళాల కోసం కేంద్ర ప్రభుత్వం అధికారిక యూపీఐ ఐడీ గురించి ప్రచారం ప్రారంభించిన కొన్ని గంటల్లోనే సైబర్‌ నేరగాళ్లు నకిలీని సృష్టించి అంతర్జాలంలో ఉంచినట్లు వెల్లడైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)