గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 1 PM

1. సచివాలయం కూల్చివేత ఆపేయండి: హైకోర్టు

సచివాలయ భవనాల కూల్చివేత పనులు సోమవారం వరకు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆ ప్రాంతాల్లోనే గాలిలో వైర‌స్‌ వ్యాప్తి!

క‌రోనా వైర‌స్ గాలిద్వారా వ్యాపిస్తోంద‌న్న వాద‌న గ‌త కొన్నిరోజులుగా మొద‌లైన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ప‌రిశీలించాల‌ని కోరుతూ దాదాపు 200మందికిపైగా శాస్త్రవేత్త‌లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు లేఖ రాశారు. ప‌రిశీల‌న అనంత‌రం గాలిద్వారా వైర‌స్ వ్యాపించే అవ‌కాశాన్ని అంగీక‌రించిన డ‌బ్ల్యూహెచ్ఓ, కొన్ని ప‌రిస్థితుల్లో మాత్రమే ఇది సాధ్య‌మ‌ని స్ప‌ష్టం చేసింది. ముఖ్యంగా రెస్టారెంట్లు, బృంద‌గానం చేసే ప్ర‌దేశాలు, వ్యాయామ త‌రగ‌తులు నిర్వ‌హించే ప్ర‌దేశాల్లో మాత్ర‌మే వైర‌స్ గాలిలో వ్యాపించే అవ‌కాశాలను అధ్య‌య‌నాలు సూచిస్తున్నాయ‌ని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కొత్త ఆలయం, మసీదు నిర్మిస్తాం: కేసీఆర్‌  

సచివాలయ భవనాల కూల్చివేతతో ఆలయం, మసీదుకు ఇబ్బంది కలగడంపై సీఎం కేసీఆర్‌  విచారం వ్యక్తం చేశారు. సచివాలయ స్థలంలో ప్రభుత్వ ఖర్చుతో ఎక్కువ విస్తీర్ణంలో ఆలయం, మసీదు  నిర్మిస్తామన్నారు. భవనాలు కూల్చే క్రమంలో ప్రార్థనామందిరాలపై శిథిలాలు పడి కొంతనష్టం జరిగిందని  తెలిపారు. ఇలా జరగడంపట్ల ఎంతో చింతిస్తున్నానని, ఇది కాకతాళీయంగా జరిగిందని, అందరూ  సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. భార‌త్‌: ఒక్క‌రోజే 26,506 కేసులు!

దేశంలో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. గ‌త వారంరోజులుగా నిత్యం రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా నిన్న ఒక్క‌రోజే అత్య‌ధికంగా 26,506 పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. దేశంలో క‌రోనా వైర‌స్ బ‌య‌ట‌ప‌డ్డ అనంత‌రం రోజూవారీ సంఖ్య‌లో ఇదే గ‌రిష్ఠం. దీంతో శుక్ర‌వారం నాటికి దేశంలో క‌రోనా వైర‌స్ బాధితుల సంఖ్య 7,93,802కు చేరింది. అంతేకాకుండా గ‌డిచిన 24గంటల్లో మ‌రో 475 క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రూ.700 కోట్ల బురిడీ కేసుపై త్వరలోనే స్పష్టత  

తూర్పు గోదావరి జిల్లాలో బ్యాంకులను బురిడీ కొట్టించి రూ.700 కోట్ల రుణాలు పొందిన  వ్యవహారంలో నమోదైన కేసులను సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు జిల్లా ఎస్పీ అద్నాన్‌  నయీం అస్మి తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి సీబీఐకి కేసు బదిలీ కోసం లేఖ వెళ్లిందని  చెప్పారు.దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందన్నారు. బ్యాంకులను మోసపుచ్చిన అంశంపై గత ఏడాది మే,  అక్టోబరు నెలల్లో కాకినాడ, అనపర్తి, బిక్కవోలు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 5 కేసులు, రాజానగరం పోలీస్‌ స్టేషన్‌  పరిధిలో 8 కేసులు నమోదైన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఎన్‌కౌంటర్‌లో నలుగురు నక్సల్స్‌ మృతి

బిహార్‌లో పోలీసులు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సల్స్ హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. పశ్చిమ చంపారన్‌ జిల్లా బగహా ప్రాంతంలో నక్సల్స్‌ తిరుగుతున్నారన్న సమాచారంతో పోలీసులు శుక్రవారం ఉదయం గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడ్డ నక్సల్స్‌.. పోలీసులపైకి కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పులు ప్రారంభించడంతో నలుగురు నక్సలైట్లు అక్కడికక్కడే మృతిచెందారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఆక్సిజన్‌ అందక నలుగురి మృతి

జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సకాలంలో ఆక్సిజన్‌ అందకపోవడంతో నలుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు కొవిడ్‌ బాధితులు కావడం గమనార్హం. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సిలిండర్ అయిపోవడంతో కొవిడ్‌ విభాగంలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ముగ్గురు, సాధారణ వార్డులో ఒకరు మృతి చెందారు. వీరంతా నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వారే. ఈ విషయం తెలుసుకున్న బాధితుల కుటుంబసభ్యులు ఆసుపత్రికి చేరుకుని ధర్నా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అందుకే అతను అత్యద్భుతమైన పేసర్‌: సచిన్‌

రివర్స్‌ స్వింగ్‌ బౌలింగ్‌లో ఇంగ్లాండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ అత్యద్భుతమైన బౌలర్‌ అని క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ప్రశంసించాడు. తాజాగా విండీస్‌ మాజీ సారథి బ్రయన్‌ లారాతో 100 ఎంబీ మొబైల్ యాప్‌లో మాట్లాడిన లిటిల్‌మాస్టర్‌ రివర్స్‌ స్వింగ్‌ బౌలింగ్‌పై స్పందించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌-విండీస్‌ జట్ల మధ్య సౌథాంప్టన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో ఆండర్సన్‌ కీలకంగా ఉండబోతున్నట్లు వెల్లడించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. #ప్రభాస్‌ 20 ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది..!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్‌ కొత్త చిత్రం ఫస్ట్‌లుక్‌ రానే వచ్చింది. సాహో తర్వాత ప్రభాస్‌ ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలో తన 20వ సినిమా చేస్తున్నాడు. ప్రభాస్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఇందులో ప్రభాస్‌, పూజా హెగ్డే రొమాంటిక్‌గా నిలబడిన తీరు ఆకట్టుకుంటోంది. సినిమాకి ‘రాధే శ్యామ్‌’ టైటిల్‌ పెట్టినట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అదే పేరును చిత్ర బృందం ఖరారు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. షారుఖ్‌ను అడిగినా అది జరగలేదు: గంగూలీ  

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆ జట్టు బాధ్యతల్ని పూర్తిగా తనకు వదిలేయమని కోరినా అది జరగలేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పష్టంచేశాడు. ఇటీవల గౌతమ్‌ గంభీర్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను కేకేఆర్‌కు కెప్టెన్ అయ్యాక 2011లో ఆ జట్టు సహ యజమాని, బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ఖాన్‌ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడని చెప్పాడు. ఈ విషయంపై స్పందించిన దాదా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలా పేర్కొన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని