శుక్రవారం, మే 29, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

మా పిల్లల పేర్లు కరోనా, కొవిడ్‌...

రాయ్‌పూర్‌: కరోనా, కొవిడ్‌... ప్రస్తుతం ఈ పేర్లు వింటే ప్రపంచం మొత్తం వణికిపోతోంది. గత డిసెంబర్‌లో చైనాలో పుట్టిన కొత్త వ్యాధి కరోనా వైరస్‌ (కొవిడ్-19). ఇప్పటికే ప్రపంచంలోని 200 దేశాల్లో పది లక్షల మందికి సోకింది. కరోనా కాటుకు ఇప్పటికే 51,000 మంది బలయ్యారు. అయితే ఇవేమీ పట్టించుకోని జంట ఒకరు తమకు పుట్టిన కవల పిల్లలకు ఆ వ్యాధిపేరే పెట్టుకోవటం విశేషం. వివరాల్లోకి వెళితే... ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన ఓ జంటకు మార్చి 27న తెల్లవారుఝామున కవల పిల్లలు పుట్టారు. వారిలో ఒకరు అమ్మాయి, మరొకరు అబ్బాయి. వారిలో అబ్బాయికి కొవిడ్‌ అని... అమ్మాయికి కరోనా అని పేరు పెట్టినట్టు ఆ బిడ్డల తల్లి ప్రీతి వర్మ చెప్పారు. 

ఆ పేర్లే ఎందుకంటే...

‘‘మార్చి 26 అర్ధరాత్రి నాకు అనుకోకుండా నొప్పులు మొదలయ్యాయి. దీనితో నా భర్త అంబులెన్స్‌కు ఫోన్ చేసి పిలిపించారు. లాక్‌డౌన్‌ కారణంగా వాహనాలకు అనుమతి లేనందున పోలీసులు మమ్మల్ని చాలాసార్లు ఆపారు. కానీ, నా పరిస్థితిని చూసి వెంటనే అనుమతించారు. అప్పటికే అర్ధరాత్రి దాటింది. అసలు వైద్యులు అందుబాటులో ఉంటారా? అని నాకు భయం మొదలైంది. అదృష్టవశాత్తూ డాక్టర్‌ అంబేద్కర్‌ స్మారక ఆస్పత్రి వైద్య సిబ్బంది మాకు ఎంతో సహకరించారు. లాక్‌డౌన్‌ సమయంలో రోజులను మేము జన్మలో మర్చిపోలేము. నిజానికి కరోనా లేదా కొవిడ్‌ ప్రాణాంతక వైరస్‌ అని మాకు తెలుసు. కానీ, ఇది పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత వంటి మంచి అలవాట్ల ప్రాధాన్యాన్ని చాటి చెప్పింది. అందుకే మేము మా పిల్లలకు ఈ పేర్లు పెట్టాలని నిర్ణయించుకున్నాము.’’ అని వారి మాతృమూర్తి వివరించారు.

కాగా ఆస్పత్రిలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ఈ కవల చిన్నారుల్ని ఆస్పత్రి సిబ్బంది కూడా కరోనా, కొవిడ్‌ అన్న పేర్లతోనే పిలవటం ఇప్పటికే మొదలుపెట్టారట. చెడులోనూ మంచిని గ్రహించడమంటే ఇదేనేమో!

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)