గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

AP: కొవిడ్‌ కేంద్రాల నిర్వహణకు జిల్లాకు ₹కోటి

అమరావతి: రాష్ట్రంలో కరోనా నివారణలో భాగంగా క్వారంటైన్‌ కేంద్రాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కొవిడ్‌ నియంత్రణ నోడల్‌ అధికారి కృష్ణబాబు అన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న అన్ని కేంద్రాల నుంచి అక్కడి పరిస్థితులపై వివరాలు సేకరించామని చెప్పారు. ప్రతి జిల్లాలోని క్వారంటైన్‌ కేంద్రాల్లో పడకల సంఖ్య 5 వేలకు పెంచాలని ఆదేశించామన్నారు. కొవిడ్‌ కేర్‌ కేంద్రాల కోసం జిల్లాకు కోటి రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ మొత్తాన్ని వైద్య పరికరాలు, సౌకర్యాలకు వాడాలని సూచించామని చెప్పారు. 
అలాగే కొవిడ్‌ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యలు జేసీలకు అప్పగించామని కృష్ణబాబు తెలిపారు. జూన్‌ 30 వరకు కొవిడ్‌ కేంద్రాలకు చెల్లించే బకాయిలను 15లోపు అందజేస్తామని చెప్పారు. కొవిడ్‌ బాధితుల ఆహారం కోసం రోజుకు రూ.500 కేటాయిస్తున్నట్లు తెలిపారు. పనితీరు సరిగాలేని కేంద్రాల బాధ్యులకు మెమోలు జారీ చేసినట్లు వెల్లడించారు. మంగళవారం నాటికి మార్పులేకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. కొవిడ్‌ కేంద్రాల్లో ఉంటున్న వారి నుంచి రోజువారి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. 

ap news, coronavirus, covid-19, ఏపీ న్యూస్‌, కరోనా వైరస్‌, కొవిడ్‌-1

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని