Published : 15/05/2021 00:17 IST
స్ప్రే.. మరింత స్మార్ట్‌గా!

బాడీ స్ప్రే లేకపోతే కొంతమంది యూత్‌కి అలంకరణ పూర్తికాదు. రోజు మధ్యలో వీటిని మళ్లీమళ్లీ ఉపయోగిస్తుంటారు. వీటి పరిమాణం పెద్దగా ఉండటంతో అన్నివేళల్లో వెంట తీసుకెళ్లడం సాధ్యం కాకపోవచ్చు. చిన్న పరిమాణంలో ఉన్నవి కొన్ని అందుబాటులో ఉన్నా వాటిని వాడుకోగానే బయట పడేయాల్సిందే. ఆ ఇబ్బంది లేకుండా మోర్డెకో కంపెనీ అత్యంత సొగసైన నానో స్ప్రేయర్‌ మెటల్‌ బాటిల్‌ని విడుదల చేసింది. చూడ్డానికి తుపాకీ బుల్లెట్‌లా చిన్నగా ఉంటుంది ఇది. దీన్ని మన కీ చైన్‌కి తగిలించుకోవచ్చు. మనకిష్టమైన సువాసనల స్ప్రేని నింపుకొని ఎంచక్కా జేబులో పెట్టుకోవచ్చు. అమ్మాయిలైతే పర్స్‌, హ్యాండ్‌బ్యాగ్‌లో వేసుకోవచ్చు. ఇది రీఫిలబుల్‌. అయిపోగానే మళ్లీ నింపుకోవచ్చు. అన్నట్టు ఇది కరోనా కాలం కదా. హ్యాండ్‌ శానిటైజర్‌గానూ వాడుకోవచ్చు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని