దేశం అన్ని విషయాల్లోనూ స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో వాడుతున్న యాప్‌ల విషయంలోనూ అదే జరుగుతోంది. దేశీయ యాప్‌ల వాడకాన్ని ప్రోత్సహిస్తూ మిట్రాన్ సంస్థ ‘ఆత్మనిర్భర్ యాప్స్’ పేరుతో ప్రత్యేక వేదికను అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ రూపంలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంట్లో సుమారు 100 యాప్లకుపైనే వివిధ విభాగాల్లో పొందుపరిచారు. అన్నీ దేశీయంగా రూపొందినవే. బిజినెస్, ఈ-లెర్నింగ్, వార్తలు, ఆరోగ్యం, షాపింగ్, గేమ్స్.. ఇలా పలు విభాగాల యాప్‌లను బ్రౌజ్ చేసి కావాల్సిన వాటిని ప్లే స్టోర్ నుంచి పొందొచ్చు. ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన ఆత్మనిర్భర్ పిలుపు మేరకు దేశీయ యాప్‌లకే ఓటేద్దాం అనుకునేవారు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క యాప్‌ని సెలెక్ట్ చేసి వాటికున్న ఆదరణ ఎంతో చూడొచ్చు. ఎంత మంది భారతీయులు ఆయా యాప్‌లను సపోర్టు చేస్తున్నారో చూసి, మీరు కూడా వాటిని వాడొచ్చు.