Published : 24/07/2019 00:36 IST
మెడపై నెక్లెస్‌లా..

ఎక్కువగా ఫోన్‌ వాడేవాళ్లు..మ్యూజిక్‌ ప్రియులు ఆలోచించేది రెండే రెండు..ఇయర్‌ ఫోన్‌ ఏది మంచిది? ఏ హెడ్‌సెట్‌ వాడొచ్చు? అందుకే ఇవి.. బడ్జెట్‌లో మెడపై నెక్లెస్‌లా వాలిపోయి... చెవుల్లో చక్కగా ఒదిగిపోతాయి..
‘హెచ్‌డీ’ క్వాలిటీతో..
- mivi collar

ఫోన్‌ మాట్లాడటంతో పాటు హెచ్‌డీ స్టీరియో క్వాలిటీతో మ్యూజిక్‌ వినొచ్చు. తక్కువ బరువుతో మెడకు చుట్టుకుని ట్రెండీగా కనిపిస్తుంది. వినసొంపైన బాస్‌, ట్రిబుల్‌ దీంట్లో ప్రత్యేకం. బిల్ట్‌ఇన్‌గా ఏర్పాటు చేసిన  మైక్‌తో మీ మాటలు అవతలి కాలర్‌కి స్పష్టంగా వినిపిస్తాయి. బ్లూటూత్‌తో ఫోన్‌కి కనెక్టు చేసి 30 అడుగుల పరిధిలో వాడుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 10 గంటలు పని చేస్తుంది. ఒకేసారి రెండు ఫోన్‌లకు ఇయర్‌ఫోన్‌ని అనుసంధానం చేయొచ్చు (డ్యుయల్‌ పెయిరింగ్‌). అవసరం లేనప్పుడు ఇయర్‌ఫోన్‌లు లోపల ఉన్న అయస్కాంతంతో రెండూ అతుక్కుంటాయి. దీంతో మెడపై ఎలాంటి అసౌకర్యం కలగదు. ఒకే ఒక్క బటన్‌ని నొక్కితే చాలు..  ఫోన్‌తో జతకట్టేస్తుంది.

* ధర రూ.2,849

 


ఇయర్‌ఫోన్‌తో మాట్లాడొచ్చు
- Mi Neckband

షామీ స్మార్ట్‌ఫోన్‌లనే కాదు. స్మార్ట్‌ యాక్సెసరీస్‌ని ఒక్కొక్కటిగా అందుబాటులోకి తెస్తోంది. వాటిల్లో ఈ నెక్‌బ్యాండు ఒకటి. మ్యూజిక్‌ ప్రియులకు ప్రత్యేకమైందనే చెప్పొచ్చు. బ్లూటూత్‌ 5.0 వెర్షన్‌తో ఫోన్‌కి అనుసంధానం అవుతుంది. 120ఎంఏహెచ్‌ బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్‌ చేసి 8 గంటలు పాటలు వినొచ్చు. వాయిస్‌ అసిస్టెంట్‌తో ఫోన్‌తో మాట్లాడినట్టుగానే ఇయర్‌ఫోన్‌తోనూ మాట్లాడొచ్చు. నచ్చిన పాటని ప్లే చేయమని అడగొచ్చు. ఫోన్‌ కాల్స్‌ చేయొచ్చు.. మాట్లాడొచ్చు.

* ధర రూ.1,599

 


చెవి నుంచి జారవు
- AQUAXTREME

ఇయర్‌ఫోన్‌తో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే.. బడ్స్‌ చెవి నుంచి జారిపోవడం. అలా జారకుండా వీటిని రూపొందించారు. ‘హుక్‌’ని చెవికి తగిలిస్తే ఎలాంటి పరిస్థితుల్లోనూ జారిపడవు. నీళ్లలో తడిసినా పాడవకుండా వాటర్‌ఫ్రూఫ్‌ కవచం ఉంది. 33 అడుగుల పరిధిలో బ్లూటూత్‌తో ఇయర్‌ఫోన్‌ని వాడొచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 9 గంటలు పని చేస్తుంది. వాడనప్పుడు భద్రపరచుకునేందుకు ప్రత్యేక కేస్‌ని ఇయర్‌ఫోన్‌తో పొందొచ్చు.

*ధర రూ.2,949

 


మెత్తగా.. సౌకర్యంగా..
portronics Muffs G

మ్యూజిక్‌ వినడంతో పాటు కాల్స్‌ మాట్లాడేందుకు సౌకర్యవంతమైన హెడ్‌సెట్‌. అదీ బడ్జెట్‌లో. ఎంతసేపు పెట్టుకున్నా చెవులకు ఇబ్బంది కలగకుండా మెత్తని ఇయర్‌కప్స్‌తో తయారు చేశారు. మెడపై కూడా సౌకర్యంగా ఒదిగిపోతుంది. తగిన పరిమాణంలో అమర్చుకునేందుకు వీలుగా తీర్చిదిద్దారు. ఎడమవైపు ఇయర్‌కప్‌పై కంట్రోల్‌ బటన్స్‌ని ఏర్పాటు చేశారు. యూఎస్‌బీ పోర్టుతో ఛార్జ్‌ చేసుకుని 12 గంటల వరకూ వాడుకోవచ్చు. ఫుల్‌ ఛార్జ్‌ అయ్యేందుకు 2 గంటలు పడుతుంది.

* ధర రూ.1,599

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని