Updated : 21/10/2020 06:42 IST
ఇన్‌స్టాలో కొత్తగా..

 

జీవితంలో సెలబ్రేషన్‌ ఏదైనా ఇన్‌స్టాలో అప్‌డేట్‌ అవ్వాల్సిందే. అంతలా ఫేస్‌బుక్‌ గూటి నుంచి వచ్చిన ఈ సోషల్‌ ప్లాట్‌ఫామ్‌ యూజర్లను కట్టిపడేస్తోంది. ఇప్పుడు ఇన్‌స్టా పరిచయమై 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సరికొత్త ఫీచర్లను పరిచయం చేసేందుకు సిద్ధం అవుతోంది. వాటిని ఎనేబుల్‌ చేయడం ద్వారా ఇన్‌స్టాని మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా మార్చేయొచ్చు. ఇంతకీ.. ఏంటా సౌకర్యాలు?
  జ్ఞాపకాలన్నీ ‘స్టోరీ మ్యాప్‌’పైనే..
ఎప్పటి నుంచో ఏవేవో పంచుకుని ఉంటారు. ఎప్పుడైనా వాటిని ఒకసారి రివ్యూ చేసి రీపోస్ట్‌ చేద్దాం అనుకుంటే? ‘స్టోరీ మ్యాప్‌’ని చూడొచ్చు. గత మూడేళ్ల మీ అప్‌డేట్స్‌ని క్యాలెండర్‌ వ్యూలో చూడొచ్చు. తేదీలపై ఆయా పోస్టింగ్స్‌ తాలుకూ ఇమేజ్‌లు కనిపిస్తాయి. సందర్శించిన ప్రాంతాల ఆధారంగా చూద్దాం అనుకుంటే ‘మ్యాప్‌ వ్యూ’లో రివ్యూ చేయొచ్చు. ఇన్‌స్టా వాల్‌పై గతంలోకి తొంగి చూద్దాం అనుకుంటే ఇదో చక్కని ఆప్షన్‌.
  ఆ కామెంట్స్‌ మాయం
ఏదైనా వాల్‌పై పోస్ట్‌ చేశాక, వాటిపై వచ్చే స్పందనలపై నియంత్రణ ఉండదు. కొన్ని అసభ్యకరమై కామెంట్స్‌ కనిపించొచ్చు. అలాంటి రిపోర్ట్‌ చేసిన కామెంట్స్‌ని ఆటోమేటిక్‌గా కనిపించకుండా హైడ్‌ చేస్తుంది. ప్రస్తుతం ఈ ఆప్షన్‌ ప్రయోగాత్మక పరిశీలనలో ఉంది. ఒకవేళ ఇలా మాయం చేసిన కామెంట్స్‌ని కావాలంటే ‘వ్యూ హిడెన్‌ కామెంట్స్‌’లోకి వెళ్లి చూడొచ్చు.
  ఐకాన్‌లను మార్చుకోవచ్చు
ఇన్‌స్టాగ్రామ్‌ ఐకాన్లు ఎప్పుడూ ఒకేలా ఉంటే ఏం బాగుంటుందీ.. మూడ్‌కి తగినట్టుగా ఎప్పటికప్పుడు మార్చేందుకు కొత్త ఐకాన్‌లను ప్రవేశపెట్టింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లు నచ్చిన వాటిని కస్టమైజ్‌ చేసి పెట్టుకోవచ్చు. పలు రకాల రంగుల్లో ఇన్‌స్టా ఐకాన్లు ఆకట్టుకుంటాయి.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని