Updated : 21/10/2020 01:24 IST
ఎయిర్‌పాడ్స్‌ ఉచితం

బంపర్‌ ఆఫర్‌

యాపిల్‌ ప్రియులకు వారెవ్వా అనిపించే అప్‌డేట్‌. అదేంటంటే.. ఐఫోన్‌ 11 కొన్నవారికి రూ.14,990 విలువైన  ఎయిర్‌పాడ్స్‌ ఉచితం. యాపిల్‌ అధికారిక ఆన్‌లైన్‌ అంగడిలో ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. 11 స్ఫెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. తెర పరిమాణం 6.1 అంగుళాలు. ఫేస్‌ ఐడీ బయోమెట్రిక్‌ సెట్‌అప్‌తో పని చేస్తుంది. వెనక డ్యూయల్‌ కెమెరాలు (12ఎంపీ ప్రైమరీ, 12ఎంపీ ఆల్ట్రా-వైడ్‌ లెన్స్‌) ఉన్నాయి. సెల్ఫీ ప్రియులకు మరో 12ఎంపీ కెమెరా ఉంది. A13 Bionic chipset ని వాడారు. ర్యామ్‌ 4జీబీ. బ్యాటరీ సామర్థ్యం 3,110ఎంఏహెచ్‌. ఫాస్ట్‌, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టు ఉంది. 64జీబీ ఇంటర్నల్‌ మెమరీతో కూడిన ఐఫోన్‌ 11 ఖరీదు రూ.68,300. పలు ట్రెండీ రంగుల్లో ఫోన్‌ అందుబాటులో ఉంది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని