శుక్రవారం, అక్టోబర్ 30, 2020

Published : 03/06/2020 00:35 IST
మీరు.. డెస్క్‌టాప్‌.. ఐకాన్లు!

డిజిటల్‌ కల్చర్‌

ఇంటి గుమ్మంలోకి చూసి చెప్పొచ్ఛు. ఇంట్లో వాళ్ల పద్ధతులేంటో! అలాగే, పీసీ డెస్క్‌టాప్‌ చూసి చెప్పొచ్ఛు. మీకెంత టెక్నాలజీ పరిజ్ఞానం ఉందో.. అదెలా అంటారా? పీసీ డెస్క్‌టాప్‌ మొత్తం ఫైల్స్‌, ఫోల్డర్లతో నిండి ఉంటే.. మీకు డేటా స్టోరేజ్‌ రాదని అర్థం. ఇది సిస్టం ప్రాసెసింగ్‌ సామర్థ్యం మీదా ప్రభావితం చూపుతుంది. మరైతే, సిస్టంలో ఫైల్‌ స్టోరేజ్‌కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇవిగోండి.. వీటిని ఫాలో అయితే సరిపోతుంది..

‘షార్ట్‌కట్‌’ కూడా..

స్టోరేజ్‌ డ్రైవ్‌ల్లో దేంట్లోనైనా ఫైల్స్‌ని భద్రం చేసుకుని ఒకే క్లిక్‌తో డెస్క్‌టాప్‌ నుంచి వాటిని యాక్సెస్‌ చేయొచ్ఛు అందుకు ఉన్న ‘షార్ట్‌కట్‌’లను క్రియేట్‌ చేసుకోవడం దగ్గరి దారి. ఉదాహరణకు ‘డీ’ డ్రైవ్‌లో ఏదైనా స్టోరేజ్‌ ఫోల్డర్‌ ఉంటే దాన్ని ఓపెన్‌ చేసేందుకు ప్రతిసారీ డీ డ్రైవ్‌లోకి వెళ్లకుండా డెస్క్‌టాప్‌పైనే షార్ట్‌కట్‌ క్రియేట్‌ చేసుకోవచ్ఛు అందుకు ఏం చేయాలంటే.. డ్రైవ్‌ల్లో కావాల్సిన ఫోల్డర్‌పై రైట్‌ క్లిక్‌ చేయండి. వచ్చిన డ్రాప్‌డౌన్‌ మెనూలోని ‘సెండ్‌ టూ’ని సెలెక్ట్‌ చేస్తే ‘డెస్క్‌టాప్‌ క్రియేట్‌ షార్ట్‌కట్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే సంబంధింత ఫోల్డర్‌ షార్ట్‌కట్‌ డెస్క్‌టాప్‌పై వచ్చేస్తుంది. ఇక ఎప్పుడు ఆ ఫోల్డర్‌ని ఓపెన్‌ చేయాలన్నా షార్ట్‌కట్‌ని డబుల్‌ క్లిక్‌ చేయండి చాలు.

సులువేగానీ.. సురక్షితం కాదు

నిత్యం యాక్సెస్‌ చేసే వాటిని డెస్క్‌టాప్‌పై పెట్టుకోవడం కచ్చితంగా సౌకర్యమే. కానీ, నాణేనికి రెండో వైపు అన్నట్టుగానే డెస్క్‌టాప్‌పై డేటాని పెట్టుకోవడం ఎంత మాత్రం సరైంది కాదు. ఎందుకంటే.. డెస్క్‌టాప్‌పై సేవ్‌ చేసిన వాటికి బ్యాక్‌అప్‌ ఉండదు. సిస్టంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు డేటాని బ్యాక్‌అప్‌ చేసే క్రమంలో డెస్క్‌టాప్‌పై ఉన్నవాటిని రికవరీ చేయడం కాస్త క్లిష్టమైన ప్రక్రియ. చాలా వరకూ బ్యాక్‌అప్‌ ప్రోగ్రామ్‌లు డేటాని రికవరీ చేయడంలో డెస్క్‌టాప్‌ని పెద్దగా పరిగణనలోకి తీసుకోవు. అందుకే ముఖ్యమైన ఫైల్స్‌ని ఎక్కువ కాలం డెస్క్‌టాప్‌పైనే భద్రం చేయడం సురక్షితం కాదు.

కలగూర గంపే..

ఫోల్డర్లు, ఫైల్స్‌, షార్ట్‌కట్‌లు.. ఇలా డెస్క్‌టాప్‌పై అన్నీ పెట్టేస్తారు. దీంతో లాగిన్‌ అవ్వగానే మొదటి కనిపించేది కలగూర గంపలా అన్నీ నింపేసి ఉన్న డెస్క్‌టాప్‌. దీంతో పనిని పాజిటివ్‌గా ప్రారంభించలేరు. అంతేకాదు.. డెస్క్‌టాప్‌పై పెట్టుకున్న వాల్‌ పేపర్‌ కూడా సరిగా కనిపించదు. కొన్ని సార్లు కావాల్సిన వాటిని వెతకడానికి చాలా సమయం పట్టేస్తుంది. వాల్‌పేపర్‌ రంగుల్లో కలిసిపోయిన ఫోల్డర్లు, ఫైల్స్‌ త్వరగా కంటపడవు.

‘లైబ్రరీ’లే ప్రత్యామ్నాయం..

మీరు విండోస్‌ ఓఎస్‌ వాడుతున్నట్లయితే డేటాని స్టోర్‌ చేసుకునేందుకు ‘లైబ్రరీస్‌’ని వాడొచ్ఛు అందుకు తగినట్టుగానే వేరు వేరు ఐకాన్‌లతో విండోస్‌ ఓఎస్‌ ఫోల్డర్లు డీఫాల్ట్‌గా సిద్ధం చేసి ఉంచింది. ‘డాక్యుమెంట్స్‌, పిక్చర్స్‌, మ్యూజిక్‌, వీడియోస్‌..’ సబ్‌ ఫోల్డర్లుగా లైబ్రరీస్‌ కనిపిస్తుంది. దాంట్లో డేటాని స్టోర్‌ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. ఇప్పటికే డెస్క్‌టాప్‌లో ఎక్కడైనా ఉన్న డేటాని లైబ్రరీస్‌లోకి సింక్‌ చేసుకోవచ్ఛు ఉదాహరణకు ఏదైనా ఫోల్డర్‌లో ఉన్న డాక్యుమెంట్స్‌ని లైబ్రరీస్‌లోని డాక్యుమెంట్స్‌ ఫోల్డర్‌లోకి సింక్‌ చేసుకోవాలంటే రైట్‌ క్లిక్‌ చేసి ప్రాపర్టీస్‌ని సెలెక్ట్‌ చేయండి. వచ్చిన డైలాగ్‌ బాక్స్‌తో కావాల్సిన ఫోల్డర్‌ని డాక్యుమెంట్స్‌లోకి జత చేసుకోవచ్ఛు.

నెమ్మదిస్తుంది..

ఇంట్లో సిస్టం ఉందంటే.. ఎవరికి వారే యూజర్లు క్రియేట్‌ చేసుకుంటారు. ఒకే కంప్యూటర్‌లో ఇద్దరు, ముగ్గురు యూజర్లు ఉండొచ్ఛు అలాంటప్పుడు ఒక యూజర్‌ నుంచి మరో యూజర్‌కి మారేటప్పుడు లాగిన్‌ సమయం ఎక్కువ తీసుకుంటే.. ఆ యూజర్‌ డెస్క్‌టాప్‌ పైన ఎక్కువ మొత్తంలో డేటా ఉందని అర్థం. అంటే.. డెస్క్‌టాప్‌పై పరిధిని మించి డేటాని స్టోర్‌ చేయడం వల్ల యూజర్‌ ఎకౌంట్‌లోకి లాగిన్‌ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది.

‘క్లౌడ్‌’లూ వాడొచ్ఛు.

ముఖ్యమైన ఫైల్స్‌ని డెస్క్‌టాప్‌పై పెట్టుకుని వాడడం బాగా అలవాటైతే.. సిస్టం స్టోరేజ్‌ని కాకుండా ‘క్లౌడ్‌’ సర్వీసుల్ని వాడుకుని కూడా డేటాని చిటికెలో యాక్సెస్‌ చేయొచ్ఛు సురక్షితంగా నిత్యం బ్యాక్‌అప్‌ పెట్టుకోవచ్ఛు ఒకవేళ మీరు గూగుల్‌ డ్రైవ్‌ని ఎప్పటి నుంచో వాడుతున్నట్లయితే అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌లా డ్రైవ్‌ని పీసీలో ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్ఛు జీ మెయిల్‌ లాగిన్‌ వివరాలతో ఒక్కసారి సైన్‌ఇన్‌ అయితే చాలు. గూగుల్‌ డ్రైవ్‌లోని ఫైల్స్‌ని సిస్టం ఫైల్స్‌ మాదిరిగా యాక్సెస్‌ చేయొచ్ఛు మార్పులు చేసుకుని ఎప్పటికప్పుడు సింక్‌ చేసుకోవచ్ఛు ఇదే మాదిరిగా ‘పీక్లౌడ్‌, మీడియాఫైర్‌, వన్‌డ్రైవ్‌లనూ వాడుకోవచ్ఛు.

అన్నీ సర్దండి..

ఏవేవో షార్ట్‌కట్‌లను డెస్క్‌టాప్‌పై పెట్టుకుంటాం.. దీంతో గందరగోళంగా అన్నీ తెరపై కనిపిస్తుంటాయ్‌. అలాంటప్పుడు ఆయా అప్లికేషన్‌ షార్ట్‌కట్‌లను డెస్క్‌టాప్‌ నుంచి ప్రత్యామ్నాయంగా స్టార్ట్‌మెనూ, టాస్క్‌బార్‌ల్లోకి పంపొచ్ఛు అందుకు ఏదైనా అప్లికేషన్‌ షార్ట్‌కట్‌పై రైట్‌క్లిక్‌ చేయండి. వచ్చిన పాప్‌అప్‌ మెనూలో ‘పిన్‌ టూ స్టార్ట్‌ మెనూ’ కనిపిస్తుంది. క్లిక్‌ చేస్తే షార్ట్‌కట్‌ స్టార్ట్‌ మెనూకి జత అవుతుంది. అలాగే, మరికొన్నింటిని ‘పిన్‌ టూ టాస్క్‌బార్‌’ని ఎంపిక చేసుకోవడం ద్వారా టాస్క్‌బార్‌పైకి వచ్చేలా చేయొచ్ఛు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని