ఆదివారం, నవంబర్ 01, 2020

Published : 03/06/2020 00:35 IST
ఒక్క క్లిక్‌ చాలు!

ఈ-కబుర్లు మీవే

రోజంతా ఇంట్లోనో.. ఆఫీస్‌లోనో డెస్క్‌టాప్‌పై పని చేస్తుంటాం. అవసరమైన వాటిల్లో లాగిన్‌ అవుతాం. వాటిల్లో కొన్ని మెయిల్‌ సర్వీసులు, సోషల్‌ మీడియా ఎకౌంట్‌లు, స్ట్రీమింగ్‌ సైట్‌లు.. ఇలా ఏవైనా ఉండొచ్ఛు కొన్ని సార్లు పని ఒత్తిడిలో ఓపెన్‌చేసిన కొన్నింటిని లాగవుట్‌చేయడం మర్చిపోతుంటాం. దీంతో ఇతరులు ఎవరైనా వాటిని యాక్సెస్‌ చేసే వీలుంటుంది. అలా కాకుండా ఒకేఒక్క క్లిక్కుతో ఓపెన్‌చేసిన చాలా వరకూ వెబ్‌సర్వీసుల్ని లాగవుట్‌చేసేయాలంటే? https://logify.ga సైట్‌ని బ్రౌజర్‌లో ఓపెన్‌ చేసి హోం పేజీలో కనిపించే బటన్‌పై నొక్కండి. లాగిన్‌లో ఉన్న అన్ని ఎకౌంట్స్‌ లాగవుట్‌ అవుతాయి. ఇక మరిచిపోతామన్న భయమక్కల్లేదు.

- రాము, విజయవాడ

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని