Published : 11/03/2020 01:15 IST
ఇక ఏదీ పోదు

వాడితేపోలా!

తాళాలు, రిమోట్‌, ఫోన్‌.. ఇలా కొన్నింటిని ఎక్కడో పెట్టేసి తెగ వెతికేస్తుంటాం. కొన్ని సార్లు ఎంత వెతికినా దొరకవు. ఈ సమస్యకి బుల్లి ట్రాకర్‌తో చెక్‌ పెట్టొచ్చు. MYNTTracker.  ఇదే ఆ ట్రాకర్‌. లాకెట్‌లా కనిపించే దీన్ని దేనికైనా ఇట్టే అమర్చుకుని వాడుకోవచ్చు. ఇదొక స్మార్ట్‌ ట్రాకర్‌. మీరు వాడే స్మార్ట్‌ఫోన్‌తో జతకట్టి పని చేస్తుంది. ఇంట్లో కారు తాళాలు ఎక్కడున్నాయో కనిపించకుంటే.. ఫోన్‌తో ట్రాకర్‌ని రింగ్‌ అయ్యేలా చేయొచ్చు. దీంతో గదిలో ఏ మూలన ఉన్నా క్షణాల్లో వెతికి పట్టేయొచ్చు. అంతేకాదు ఇదొక రిమోట్‌ కూడా.. ఆఫీసులో మీటింగ్స్‌కి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ రిమోట్‌గానూ వాడొచ్చు. బయటికొచ్చినపుడు ఫొటోలు, వీడియోలు తీసుకోవాలంటే సింపుల్‌గా మింట్‌పై ఉన్న బటన్‌ నొక్కితే చాలు.. ఫొటోలు తీసేస్తుంది.  

* ధర రూ.5,000

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని