Published : 12/02/2020 00:51 IST
స్మార్ట్‌గా..ప్రేమతో..!

‘లవ్లీ’ కార్నర్‌

రెండు మనసుల మధ్య దూరాన్ని దగ్గర చేసే శక్తి ఒక్క టెక్నాలజీకే ఉంది. అందుకే ప్రేమికులు గ్యాడ్జెట్‌లకు అంత ప్రాధాన్యం ఇస్తారు. మరి, ప్రేమికుల దినోత్సవం వస్తోందిగా.. ఒకరికొకరు ఏదైనా భిన్నంగా ఇచ్చిపుచ్చుకోవాలనుకుంటే.. వీటిని ప్రయత్నించండి. మీ ప్రేమ మరింత స్మార్ట్‌ అవుతుంది. వీటిలో కొన్ని దేశీయ మార్కెట్‌లో అందుబాటులో ఉంటే.. ఇంకొన్ని ప్రపంచ విపణిలో సందడి చేస్తున్నాయి..


‘ఆఫ్‌’ అయ్యే ఊసే లేదు

తనో చోట.. మీరో చోట.. దూరం భారమైనప్పుడు ఫోన్‌ చేస్తారు. అప్పుడు స్విచ్ఛాఫ్‌ అని వస్తే.. పట్టరానంత కోపం.. ఆ వెంటనే భయం కలుగుతుంది కదా. అందుకే ఎప్పుడూ స్విచ్ఛాఫ్‌ అనే మాటే వినిపించకుండా ఉండాలంటే..  ఓ పవర్‌ బ్యాంకుని గిఫ్ట్‌గా ఇవ్వండి. 20,000 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో కూడిన ‘ఎంఐ’ పవర్‌బ్యాంకుని ప్రయత్నించొచ్చు. కొత్తగా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన పవర్‌బ్యాంకులకు డ్యూయల్‌ ఇన్‌పుట్‌ పోర్టులు ఉన్నాయి. (టైప్‌ సీ, మైక్రో యూఎస్‌బీ) రెండు పోర్టులతో ఒకేసారి రెండు ఫోన్‌లను ఛార్జ్‌ చేయొచ్చు. ప్రయాణాల్లో ఉన్నప్పుడూ.. మీకు దూరంగా రోజులు గడపాల్సివచ్చినప్పుడూ ఉపయోగపడతాయి.


చెవిచెవికో పాట..!

ఎంత వరల్డ్‌ ఫేమస్‌ లవర్స్‌ అయినా అభిరుచులన్నీ ఒకేలా ఉండవుగా.. మ్యూజిక్‌ విషయంలో మరీనూ.. మీకు పాప్‌ మ్యూజిక్‌ నచ్చొచ్చు. తనకి లవ్‌ సాంగ్స్‌. మరి అలా తన భుజంపై వాలి ఒకే ఇయర్‌ఫోన్స్‌లో ఒకేసారి ఎవరికి నచ్చిన పాటలు వాళ్లు వినలేరా? అంటే వినొచ్చు. దానికి ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి. పేరు SplitCloud. ఈ యాప్‌ ద్వారా ఒకేసారి రెండు పాటలు వినొచ్చు. కుడి ఇయర్‌ఫోన్‌లో ఒక పాట. ఎడమ ఇయర్‌ఫోన్‌లో మరోటి ప్లే అవుతుంది. ఇలా ఎవరికి నచ్చిన పాట వారు వినొచ్చు. మీ ఆలోచనలు ఒకటే కావొచ్చు. మీ అభిరుచులు కావుగా..! మరింకెందుకాలస్యం. వెంటనే ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి ఈ ప్రేమికులరోజున అలా పాటల్లో మెట్రో కబుర్లతో, రోడ్లపై లాంగ్‌వాక్‌తో విహరించండి.


సెల్ఫీ అదుర్సే..

ఇరువురూ కలిస్తే చాలు. ఒకటో రెండో అదిరే సెల్ఫీలు పడాల్సిందే. అలాంటప్పుడు మెరిసే సెల్ఫీలు మరిన్ని తీసుకునేందుకు ‘సెల్ఫీ లైట్‌’లు బహుమతిగా ఇవ్వొచ్చు. కావాలంటే I-CELLMarklif FL-36 Double Bright లైట్‌ని ప్రయత్నించండి. దీన్ని ఫోన్‌కి అమర్చుకుని సెల్ఫీలు తీసుకోవచ్చు. టిక్‌టాక్‌ వీడియోలు చిత్రీకరించొచ్చు. ధర రూ.300


అద్దంలో అందం..

ప్రియుడిని కలవాలనుకుంటే కాస్తైనా మేకప్‌ టచ్‌ ఇవ్వని అమ్మాయిలు ఉండకపోవచ్చు. అలాంటప్పుడు వారికో స్మార్ట్‌ అద్దాన్ని బహుమతిగా ఇస్తే! అలాంటిదే ఈ రీ’ః’్ల్ల న్నీః్టi-్ణ మిర్రర్‌. ఎల్‌ఈడీ లైట్‌తో పని చేస్తుంది. దీంతో అద్దంలో ముఖం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు మేకప్‌ టచ్‌ ఇచ్చుకోవడం చాలా ఈజీ. ధర రూ.649.
*జూనో మేకప్‌ మిర్రర్‌ మరోటి. దీంట్లోని లైట్‌ ఆన్‌ చేసి మేకప్‌ సమయంలో ఎలాంటి తప్పులు జరక్కుండా చూడొచ్చు. జూనో యాప్‌తో మీకు నచ్చినట్టుగా లైట్‌ని సెట్‌ చేసుకోవచ్చు కూడా. రింగ్‌లైట్‌తో సెల్ఫీలు తీసుకోవచ్చు.

 


ముఖం మెరిసిపోయేలా..

చక్కనమ్మ చెక్కిలికి చక్కని మేకప్‌ అద్దేందుకు ఓ స్మార్ట్‌ బ్రష్‌ ఇస్తే.. ఆ కిక్కే వేరు కదా. అందుకే ‘బ్లెండ్‌స్మార్ట్‌’ బ్రష్‌. మీకు అవసరం అయిన బ్రష్‌ని హ్యాండిల్‌కి బిగిస్తే చాలు. బటన్‌ నొక్కగానే బ్రష్‌ తిరుగుతుంది. దీంతో ఎక్కువ శ్రమించకుండా ఇట్టే మేకప్‌ చేసుకోవచ్చు. పలు రకాల బ్రష్‌లను హ్యాండిల్‌కి అమర్చుకుని వాడుకోవచ్చు.


 

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని