Published : 12/02/2020 00:42 IST
బడ్జెట్‌లోనే ‘బడ్‌’లు..

తాజా

ఇప్పుడంతా నడిచేది ఇయర్‌బడ్స్‌ ట్రెండే. ఎలాంటి వైర్‌ల సపోర్టు లేకుండా చెవుల్లో చేరిపోయి టెక్నాలజీ ప్రియుల్ని అలరిస్తున్నాయి. అందుకే బడ్జెట్‌ ఇయర్‌బడ్‌లను అందుబాటులోకి తెచ్చింది పీట్రాన్‌. ‘బాస్‌బడ్స్‌ ప్రొ’తో చౌక ధరలో మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. తక్కువ బరువు, హెచ్‌డీ క్వాలిటీతో 12 గంటల పాటు మ్యూజిక్‌ వినొచ్చు. బ్లూటూత్‌ 5.0 సపోర్టు ఉంది. ప్రత్యేక ఛార్జింగ్‌ కేస్‌లో పెట్టి బడ్స్‌ని ఛార్జ్‌ చేయొచ్చు. ఛార్జింగ్‌ కేస్‌కి డిజిటల్‌ డిస్‌ప్లే ఉంది. దీంతో బడ్స్‌ ఎంత మేరకు ఛార్జ్‌ అయ్యాయో సులభంగా తెలుసుకోవచ్చు. కేస్‌తో పాటు వీటి మొత్తం బరువు 35 గ్రాములు. ఒక్కో బడ్‌ బరువు కేవలం 4 గ్రాములే. టచ్‌ కంట్రోల్‌తో బడ్స్‌ని వాడొచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేసి 4 గంటలు ఫోన్‌ మాట్లాడొచ్చు. బ్యాటరీ సామర్థ్యం 40ఎంఏహెచ్‌.
* ధర రూ.1299

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని