తాజా వార్తలు

Published : 15/06/2021 01:08 IST
TS news: టీవీ ఛానల్‌ను ఏమార్చిన కేటుగాడు

హైదారాబాద్‌: ఓ ఎంటర్‌టైన్‌మెంట్‌ టీవీ ఛానల్‌ను నాగార్జున రెడ్డి అనే కేటుగాడు ఏమార్చాడు. కరోనా టీకా పేరుతో మోసం చేశాడు. మంత్రి కేటీఆర్‌ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నానని, రూ.100కే టీకా వేస్తామని టీవీ ఛానల్‌కు  ఫోన్‌ చేసి చెప్పాడు. దీంతో  తమ సంస్థలోని 1,500 మంది సిబ్బందికి టీకాలు వేయించేందుకు యాజమాన్యం రూ.1.5 లక్షలు చెల్లించింది. డబ్బులు చెల్లించిన తర్వాత స్పందన లేకపోవడంతో సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు నాగార్జునరెడ్డిని అరెస్టు చేశారు.

ఇవీ చదవండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని