తాజా వార్తలు

Published : 14/06/2021 17:57 IST
Politics: పార్టీ వీడిన వారికే నష్టం: జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్‌: నిన్నటి వరకు భాజపాను విమర్శించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అదే పార్టీలో చేరడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. తెరాసను వీడితే వారికే నష్టం తప్ప.. తమ పార్టీకేం కాదని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్‌కు తెరాసలో సముచిత స్థానం కల్పించామని, భాజపాలో చేరడం ద్వారా ప్రజలకు ఏం చెబుతారని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెరాస సంక్షేమ పథకాలతో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. భాజపా హిట్లర్‌ పార్టీ అని గతంలో ఈటల చెప్పారనీ, కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను నల్ల చట్టాలుగా అభివర్ణించిన ఆయన మాటలకు, చేతలకు పొంతనలేదని జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని