తాజా వార్తలు

Published : 14/06/2021 09:57 IST
TS News: రుద్రంగిలో అత్య‌ధిక వ‌ర్ష‌పాతం

హైద‌రాబాద్‌: బంగాళాఖాతంలో పశ్చిమబెంగాల్‌, ఒడిశా తీరాల వద్ద ఏర్పడిన అల్పపీడనం కార‌ణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ ఉద‌యం 7 గంట‌ల వ‌ర‌కు సిరిసిల్లా జిల్లా రుద్రంగిలో 13.7 సెం.మీ, జ‌గిత్యాల జిల్లా జ‌గ్గాసాగ‌ర్‌లో 12.8 సెం.మీ వ‌ర్ష‌పాతం న‌మోదైంది. దీంతో పాటు హైదరాబాద్ న‌గ‌రంలోనూ ఈ తెల్ల‌వారుజాము నుంచి చాలా ప్రాంతాల్లో వ‌ర్షం కురిసింది. ర‌హ‌దారులు జ‌ల‌మ‌యం కావడంతో ప‌లు చోట్ల వాహ‌న‌దారులు ఇబ్బందులు ప‌డ్డారు. 

అల్ప‌పీడ‌నం కార‌ణంగా తెలంగాణ, కర్ణాటకల మీదుగా అరేబియా సముద్రం వరకూ ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రేపు కూడా తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావారణశాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. 

తెలంగాణలో వ‌ర్ష‌పాతం వివ‌రాలు.. 

ఇవీ చదవండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని