తాజా వార్తలు

Published : 14/06/2021 05:40 IST
నల్ల బజారులో బ్లాక్‌ ఫంగస్‌ ఇంజక్షన్ల విక్రయం

పోలీసుల అదుపులో ఉన్న నిందితులు

అమీర్‌పేట, న్యూస్‌టుడే : బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స ఇంజక్షన్లను నల్లబజారులో అధిక ధరలకు విక్రయిస్తున్న ఐదుగురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సార్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఘటన వివరాలను ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు ఉపయోగించే లైపోసోమల్‌ యాంపోటెరిసిన్‌-బి ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందుకున్న నార్త్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం బీకేగూడ ప్రాంతంలో ఐదుగురు సభ్యులు గల ముఠాను పట్టుకున్నారు. బీకేగూడలో నివసించే కృష్ణా జిల్లా, గుడివాడకు చెందిన వల్లపోతుల వేణుగోపాల్‌(40) ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆ ఇంజక్షన్ల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు రూ.5,364, రూ.7,858 విలువ చేసే రెండు వేర్వేరు తయారీ సంస్థలకు చెందిన ఇంజక్షన్లను సేకరించాడు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2కు చెందిన మెడికల్‌ ఏజెంట్‌ గాజుల నవీన్‌(29), కొత్తపేటకు చెందిన కారు డ్రైవర్‌ వర్రె అశోక్‌(29), నిజాంపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కందుకూరి ప్రసాద్‌(36), కూకట్‌పల్లికి చెందిన ఎరువుల వ్యాపారి బొమ్మశెట్టి హరీష్‌(28)లను జట్టుగా చేర్చుకున్నారు.ఒక్కో ఇంజక్షన్‌ను రూ.35 వేల చొప్పున విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నారు. 9 ఇంజక్షన్లు, 5 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని