తాజా వార్తలు

Published : 14/06/2021 05:27 IST
ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ శిక్షణకు దరఖాస్తు చేసుకోండి

కాచిగూడ, న్యూస్‌టుడే:: నేషనల్‌ కంప్యూటింగ్‌ కౌన్సిల్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్‌ రేణుకారెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, కంప్యూటర్‌ అక్కౌంటెన్సీ టాలీ, మాస్టర్‌ డిప్లొమా ఇన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ టీచర్‌ ట్రైనింగ్‌ కోర్సు, వెబ్‌ డిజైన్‌ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల వారు ఈ నెల 30 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు 95058 00042 నంబరులో సంప్రదించాలని సూచించారు.

బ్రాహ్మణ వితంతు పింఛన్లకు..

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 2020-21లో కరోనాతో చనిపోయిన అర్చకుల భార్యల నుంచి వితంతు పింఛనుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు భారత బ్రాహ్మణ సంస్థాన్‌, బ్రాహ్మణ సంక్షేమ భవన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు గిరిప్రసాద్‌శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్‌ కార్డు, కొవిడ్‌ చికిత్స వివరాలు, మరణ ధ్రువీకరణ పత్రంతో దరఖాస్తు చేసుకుంటే నెలకు రూ.వెయ్యి ఇస్తామని చెప్పారు. ఇతర వివరాలకు ఫోన్‌ నంబరు: 63049 21292.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని