తాజా వార్తలు

Updated : 14/06/2021 07:22 IST
TS News: అన్నం తినలేదని అన్న మందలించాడని..

శామీర్‌పేట, న్యూస్‌టుడే: అన్నం సక్రమంగా తినకపోతే ఎలాగని అన్న మందలించినందుకు తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట ఎస్సై వీరశేఖర్‌ వివరాల ప్రకారం... కవాడిగూడ పద్మశాలికాలనీకి చెందిన బాలనగరపు నవీన్‌(26) ప్రైవేట్‌ ఉద్యోగి. సరిగా భోజనం చేసేవాడు కాదు. చిన్న విషయాలకు అలిగేవాడు. అన్న కిరణ్‌కుమార్‌ మందలించడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో చెప్పకుండా ఈనెల 4న దిల్‌సుఖ్‌నగర్‌లోని చిన్నమ్మ ఇంటికి వెళ్లాడు. రెండు రోజుల తర్వాత రాణిగంజ్‌లో విధులకని బయలుదేరాడు. పనికి వెళ్లకుండా 8వ తేదీన బొల్లారంలో మేనత్త ఇంటికి చేరాడు. అక్కడ రెండు రోజులు ఉండి, ఇంటికి వెళ్తున్నానని చెప్పి శామీర్‌పేట పెద్ద చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని బయటకు తీశారు. జేబులోని ఆధారాల ప్రకారం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని