తాజా వార్తలు

Published : 14/06/2021 05:27 IST
పీవీఎన్‌ఆర్‌వే ఎక్కి.. విభాగినిని ఢీకొట్టి దుర్మరణం

వంశీకృష్ణారెడ్డి

కాటేదాన్‌, న్యూస్‌టుడే: పీవీఎన్‌ఆర్‌వేపై ద్విచక్రవాహనాలకు అనుమతి లేదన్న విషయం తెలియక ఎక్కిన ఓ యువకుడు.. విభాగినిని ఢీకొట్టి దుర్మరణం పాలయ్యాడు. సీఐ కనకయ్య కథనం ప్రకారం... కర్నూలు జిల్లా నంద్యాల మండలం పాండురంగాపురానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు వంశీకృష్ణారెడ్డి(25).. అక్కాబావ కూకట్‌పల్లిలో ఉంటున్నారు. స్వగ్రామం నుంచి బెంగళూరు హైవే మీదుగా బైకుపై అక్క ఇంటికి బయలుదేరాడు. ఆదివారం మధ్నాహ్నం రాజేంద్రనగర్‌ ఆరాంఘర్‌ చౌరస్తాలోని పీవీఎన్‌ఆర్‌ మార్గంపైకి ఎక్కాడు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి కార్లు భారీగా వస్తుండడంతో అయోమయానికి గురై.. 321 స్తంభం వద్ద విభాగినిని ఢీకొట్టాడు. శిరస్త్రాణం తల నుంచి ఊడిపోయి తలకు తీవ్రగాయాలై పది నిమిషాలు కొట్టుమిట్టాడాడు. ట్రాఫిక్‌ సీఐ లవకుమార్‌రెడ్డి చేరుకొని అంబులెన్స్‌ను వంశీకృష్ణారెడ్డిని ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు.

కీసర పరిధిలో లారీ డ్రైవర్‌ మృతి

కీసర, న్యూస్‌టుడే: ఆగి ఉన్న వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో డ్రైవర్‌ దుర్మరణం చెందాడు. శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కీసర పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లికి చెందిన లారీ డ్రైవర్‌ రాంరెడ్డి(45) ఓఆర్‌ఆర్‌ మీదుగా ఘట్‌కేసర్‌ నుంచి శామీర్‌పేట వైపు ప్రయాణిస్తున్నారు. కీసర మండల పరిధిలో ఆగి ఉన్న గుర్తు తెలియని వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టాడు. లారీ క్యాబిన్‌లో ఇరుక్కు పోయారు. పోలీసులు చేరుకొని అరగంట పాటు శ్రమించి బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆయన మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని