తాజా వార్తలు

Published : 14/06/2021 05:27 IST
యువకుడి వేధింపులు.. బాలిక బలవన్మరణం

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: పెళ్లి చేసుకోవాలంటూ యువకుడు వేధిస్తుండడంతో భరించలేని ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. బంజారాహిల్స్‌ ఎస్సై రాంబాబు కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రావులపాడుకు చెందిన బాలిక(16) నాలుగు రోజుల కిందట బంజారాహిల్స్‌ రోడ్‌ నం.2లోని ఇందిరానగర్‌లో నివసించే అక్క, బావల ఇంటికి వచ్చింది. శనివారం ఆ దంపతులు ఉద్యోగానికి వెళ్లగా ఇంట్లో బాలిక, ఆమె తండ్రి ఉన్నారు. అదే సమయంలో కల్యాణ్‌ అనే యువకుడు వచ్చాడు. తనను పెళ్లి చేసుకోవాలంటూ బాలికను బెదిరించాడు. కొద్ది సమయానికే ఆమె బావ ఇంటికొచ్చారు. ఆమె తండ్రి, బావ కలిసి కల్యాణ్‌కు నచ్చజెప్పారు. మైనార్టీ తీరాక తామే పెళ్లి చేస్తామని చెప్పారు. పెళ్లికి అంగీకరించకపోతే తండ్రీకూతుళ్లిద్దరినీ చంపుతానని ఆ యువకుడు బెదిరించాడు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో బాలిక తండ్రి, బావ బయటకు వెళ్లారు. కొద్ది సమయం తరువాత సోదరి వచ్చి ఎంతసేపు తలుపు తట్టినా బాలిక తీయలేదు. ఆమె సమాచారంతో కుటుంబ సభ్యులు చేరుకుని కిటికీ పగులగొట్టి చూడగా బాలిక ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. పోలీసులు, 108 సిబ్బంది లోపలికి ప్రవేశించి, బాలికను పరీక్షించారు. అప్పటికే ఆమె మృతిచెందింది. కళ్యాణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ బాలిక తండ్రి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని