తాజా వార్తలు

Published : 14/06/2021 05:27 IST
మహమ్మామరి వ్యాప్తిని యాపేస్తుంది!

‘కాంటాక్టు’ గుర్తింపులో గో కరోనా గో యాప్‌

ఐఐఎస్‌సీ విద్యార్థుల ఆధ్వర్యంలో రూపకల్పన

గో కరోనా గో యాప్‌

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా నియంత్రణలో వైరస్‌ సోకిన వ్యక్తితో కాంటాక్టు అయినవారి గుర్తింపు కీలకం. త్వరగా గుర్తిస్తే పరీక్షలు నిర్వహించడం, విడిగా ఉంచేందుకు వీలవుతుంది. వేరొకరికి వ్యాపించకుండా ఆపే వీలుంటుంది. కాంటాక్టుల గుర్తింపునకు వివిధ సాంకేతిక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ)-బెంగళూరు విద్యార్థులు రూపొందించిన ‘గోకరోనాగో యాప్‌’ సమర్థంగా పనిచేస్తోంది. గచ్చిబౌలిలో ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం యాప్‌ను ఐఐఎస్‌సీ(బెంగళూరు), ఐఐటీ జోధ్‌పూర్‌, ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌లోనే వినియోగిస్తున్నారు. యాప్‌ను యోగేశ్‌సింహన్‌, తరుణ్‌రాంభా, ఆకాశ్‌ కొచ్చారె, శ్రీరామ్‌రమేశ్‌ తదితర 12 మంది విద్యార్థులు రూపొందించారు.

మూడు స్థాయిల్లో గుర్తింపు... గోకరోనాగో యాప్‌ను గతేడాది అందుబాటులోకి తీసుకొచ్చారు. బ్లూటూత్‌ ఆధారంగా పనిచేస్తుంది. ఒక ప్రాంగణంలో ఉన్న విద్యార్థులు, ఉద్యోగుల ముందుగా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ప్రతి యూజర్‌కు విడిగా చరవాణి ఐడీ వస్తుంది. వినియోగదారులు బ్లూటూత్‌ ఆన్‌లో ఉంచాలి. వీరిలో వారెవరైనా కరోనా బారిన పడితే, వెంటనే వారితో కాంటాక్టు అయిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయిల్లోని వ్యక్తుల వివరాలు సర్వర్‌కు అందుతాయి.

సమాచార గోప్యతకు ప్రాధాన్యం.. ఇందులో ప్రతి యూజర్‌కు ప్రత్యేకంగా యూనిక్‌ ఐడీ వస్తుంది. ఎలాంటి వ్యక్తిగత సమాచారం లేకపోవడంతో ఇబ్బంది ఉండదు. బ్యాటరీ పవర్‌ రోజులో కేవలం పది శాతమే వినియోగించుకుంటుంది. గత 24 గంటల్లో ప్రతి గంటలో ఎవరెవర్ని కలిశారో చెప్పవచ్ఛు ప్రతి గంటకు డాటాను తెలుసుకునే వీలుంది. ఆ వివరాలన్నీ ప్రత్యేక సర్వర్‌లో రికార్డవుతాయి. వాటి ఆధారంగా కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని కలిసి యూజర్లను అప్రమత్తం చేసే వీలుంటుంది. అలాగే యూజర్లు ఎడం పాటించకపోయినా యాప్‌ అప్రమత్తం చేస్తుంది.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని