తాజా వార్తలు

Published : 14/06/2021 05:08 IST
నాలా సమస్యా..? ఫిర్యాదు చేయండి!

ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌..

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, బేగంపేట(అమీర్‌పేట) : గతేడాది మహానగరంలో వరదలు సృష్టించిన బీభత్సాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది ప్రభుత్వం ముందే స్పందించింది. ముంపు ముప్పు తప్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే నేటి నుంచి 19వ తేదీ వరకూ ప్రజాప్రతినిధులు, బల్దియా అధికారులు నాలాల్లో పూడికతీత, అభివృద్ధి పనుల్ని క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించనున్నారు. దీంతోపాటు ఆయాప్రాంతాల్లో నాలాల పూడికతీత సవ్యంగా జరగకుంటే, నాలాల్లో ఏదైనా సమస్యలుంటే నేరుగా పౌరులే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వాట్సాప్‌ నెంబర్‌ను కేటాయించారు. ఇందులో నాలాల పూడికతీతకు సంబంధించిన ఫొటోలు, నాలా ప్రాంతం పేరు, సంబంధిత వ్యక్తి సమాచారంతో వివరాలు పంపిస్తే అధికారులు స్పందించి తగు చర్యలు చేపడతారు.

ఫిర్యాదులు పంపాల్సిన నంబర్‌ 98480 21665

నాకూ వ్యక్తిగతంగా పంపొచ్చు - మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

జీహెచ్‌ఎంసీ పరిధిలో నాలాల్లో పూడికతీత పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.45 కోట్ల నిధుల్ని కేటాయించిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పనుల్ని ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారన్నారు. సోమవారం తాను అధికారులతో కలిసి బేగంపేట నాలాను సందర్శించనున్నట్లు మంత్రి ప్రకటించారు. పనులపై ఫిర్యాదుల్ని వాట్సాప్‌ నంబర్‌కు పంపాలని.. నేరుగా తనకే ఫిర్యాదు చేయాలనుకునేవారు 98482 82309 నంబర్‌కు పంపాలని మంత్రి సూచించారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని