తాజా వార్తలు

Published : 14/06/2021 02:58 IST
వైద్య కళాశాల ఏర్పాటుకు సీఎం సుముఖత

ఎంపీ రంజిత్‌రెడ్డి వెల్లడి

ఈనాడు డిజిటల్‌: జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ సుముఖత వ్యక్తం చేశారని చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి తెలిపారు. కళాశాల ఏర్పాటుపై గతంలో ఇచ్చిన హామీ గురించి విన్నవించేందుకు రంజిత్‌ రెడ్డి ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వికారాబాద్‌లోని టీబీ శానిటోరియం ఆసుపత్రి సమీపంలో వైద్య కళాశాల ఏర్పాటుకు ఆయన సముఖత వ్యక్తం చేశారని రంజిత్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా అన్ని విధాలా వెనుకబడి ఉందని, ఏ చిన్న అనారోగ్యం వచ్చినా, హైదరాబాద్‌కు పరుగులు తీస్తున్నారన్నారు. దీంతో ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. వైద్య కళాశాల నెలకొల్పి పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఎంపీ స్పష్టం చేశారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని