తాజా వార్తలు

Published : 14/06/2021 02:58 IST
గడ్డిమందు నిల్వ కేసులో దుకాణ యజమాని అరెస్ట్‌

కొడంగల్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వం నిషేధించిన గడ్డిమందును నిల్వ చేసిన కేసుకు సంబంధించి ఓ దుకాణం యజమానిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఆదివారం ఎస్సై సామ్యా నాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం..కొడంగల్‌ బస్టాండ్‌ ముందున్న వైష్ణవి ఎరువుల దుకాణంలో 3400 లీటర్ల గ్లైపోసైడ్‌ (నిషేధిత గడ్డిమందు)ను శనివారం రాత్రి స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. దీని విలువ సుమారు రూ.20,41,000గా ఉంటుందన్నారు. దుకాణ యజమాని కోట్రికె పురుషోత్తంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన వివరించారు.

ఒక రోజు ముందు సోదాలు చేసినా లభించలేదు : టాస్క్‌ ఫోర్స్‌ పోలీసుల కంటే ఒక రోజు ముందు ఇతర శాఖల అధికారులు దుకాణల్లో సోదాలు జరిపినా ఎలాంటి నిషేధిత మందులుగానీ, నకిలీ విత్తనాలుగానీ దొరకలేదు. శనివారం రాత్రి టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జరిపిన దాడుల్లో మాత్రం ఈ గడ్డిమందు లభ్యం కావడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిని గత ఏప్రిల్‌ 28నే కొనుగోలు చేశారు. మే నెల నుంచి గడ్డిమందు అమ్మకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఏంచేయాలో తెలియక దుకాణం నుంచి ఇంట్లోకి తరలించి భద్రపరిచారు. ఇంత పెద్దమొత్తంలో లభించడం జిల్లాలోనే ఇదే అత్యధికమని అధికారులు అంచనా వేసినట్లు వ్యవసాయశాఖ అధికారి బాలాజీప్రసాద్‌ తెలిపారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని