తాజా వార్తలు

Published : 14/06/2021 02:58 IST
కలిసొచ్చే ఉపాధి.. మామిడి ఒరుగు

చాపలగూడెంలో ఒరుగును తీస్తున్న మహిళలు

కుల్కచర్ల, న్యూస్‌టుడే: గ్రామాల్లో ఇంటిపట్టునే ఉంటూ మహిళలు మామిడి ఒరుగును తీస్తూ ఉపాధి పొందుతున్నారు. కుల్కచర్ల, చాపలగూడెం, చౌడాపూర్‌, మందిపల్‌, వీరాపూర్‌ తదితర గ్రామాల్లో మామిడి ఒరుగును తీసి ఎండబెట్టి విక్రయాలు చేస్తున్నారు. మామిడి తోటలను లీజుకు తీసుకునే రైతులు ఈ ఏడాది కాయలను విపణులకు తరలించగా తగిన గిట్టుబాటు లభించలేదు. దీనికితోడు గతంలో కురిసిన వడగండ్ల వర్షానికి కాయలు పలు చోట్ల దెబ్బతినడం వల్ల వాటిలో పురుగులు కూడా వస్తున్నాయి. దీంతో కాయలను గ్రామాల్లో కోయిస్తూ ఒరుగును తయారు చేస్తున్నారు. ఒక బస్తా కాయలను ఒరుగు తీస్తే రూ.150 వరకు మహిళలు తీసుకుంటున్నారు. ఉదయం వేళ ఉపాధి పనులకు వెళ్లి వచ్చిన తరవాత కూడా పలువురు ఈ పనులకు వెళ్తున్నారు. ఆయా గ్రామాల్లో సీీజన్‌ల వారీగా కలిసి వచ్చే ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నామని పలువురు మహిళలు పేర్కొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని