తాజా వార్తలు

Published : 14/06/2021 02:58 IST
తరుగు ధాన్యానికీ నగదు చెల్లించాలి

రైతుకు ఆర్థిక సహాయం అందిస్తున్న మహిపాల్‌ రెడ్డి

దోమ, న్యూస్‌టుడే: తరుగు ధాన్యానికీ రైతులకు నగదు చెల్లించాలని, ఖరీఫ్‌ ప్రారంభమైనందున తక్షణమే ధాన్యం తూకాలు వేసి న్యాయం చేయాలని కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం దోమ మండలం పాలేపల్లి ధాన్యం కేంద్రాన్ని ఆయన సందర్శించారు. శనివారం నుంచి తూకాలు నిలిపివేశారనీ లారీలు రావడంలేదని రైతులు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వింటాలుకు అదనంగా తీసిన 3 కిలోల తరుగుకు సైతం రైతులకు డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు భాస్కర్‌, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం, యాదయ్య పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని