తాజా వార్తలు

Updated : 22/01/2021 09:10 IST
మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి 

హైదరాబాద్‌: రహమత్‌నగర్‌ పోలీసు అవుట్‌ పోస్టు వద్ద బుధవారం రాత్రి ఓ యువతి హల్‌చల్‌ చేసింది. మద్యం మత్తులో నగ్న ప్రదర్శనతో పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. జూబ్లీహిల్స్‌ పోలీసుల వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్టకు చెందిన యువతి(30) బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన యువకుణ్ని ప్రేమిస్తోంది. బుధవారం రాత్రి ప్రియుడికి ఫోన్‌ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పింది. యువకుడు 100కు సమాచారం ఇచ్చాడు. ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా యువతి కృష్ణకాంత్‌ పార్కు వద్ద ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లారు. దుస్తులు చించుకుంటానని బెదిరిస్తూ ఆ యువతి ఓ ఆటోలో మైత్రివనం వైపునకు, అక్కడి నుంచి యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు వద్దకు చేరుకుంది. రహమత్‌నగర్‌ అవుట్‌పోస్టు వద్ద దుస్తులు తొలగించి, కేకలు వేస్తూ చిందులేసి హంగామా సృష్టించింది. స్థానిక మహిళల సాయంతో దుస్తులు అందించి ఆమెను అవుట్‌పోస్టులోకి తీసుకొచ్చారు. యువతికి సర్ధిచెప్పి ఆ యువకుడికి అప్పగించారు.

ఇవీ చదవండి..
కారెక్కాడు... నగల దొంగ చిక్కాడు

కొలిక్కి వచ్చిన దుర్గగుడి వెండి సింహాల కేసు
 

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని