గురువారం, ఆగస్టు 06, 2020

తాజా వార్తలు

క్వారంటైన్‌ కేంద్రాల్లో నాసిరకం ఆహారం

ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ ఆరోపణ


మాట్లాడుతున్న ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌

వన్‌టౌన్‌: క్వారంటైన్‌ కేంద్రాల్లో వసతులు అధ్వానంగా ఉన్నాయని, బాధితులకు నాసిరక ఆహారం పెడుతున్నారని, తాగునీరు కూడా సరిగా అందడం లేదని, తెదేపా నగర కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ ఆరోపించారు. ఆదివారం మధ్యాహ్నం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వాసుపల్లి మాట్లాడుతూ కరోనా పరీక్షలు లక్షల సంఖ్యలో చేశామని గొప్పలు చెబుతున్నారని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయన్నారు. కరోనా పరీక్షల నిర్వహణపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖలో జిల్లా కలెక్టర్‌, జీవీఎంసీ కమిషనర్‌, ఇతర సీనియర్‌ అధికారులు ఆసుపత్రులు, క్వారంటైన్‌ కేంద్రాలకు ఎప్పటికప్పుడు వెళ్లి తనిఖీలు చేసి వసతులను మెరుగుపర్చాలన్నారు. విశాఖలో కేసులు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో వెయ్యి పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసే పనులను తక్షణమే ప్రారంభించాలన్నారు. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ప్రైవేటు ఆసుపత్రులు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కరోనా బాధితులకు నాసిరకం ఆహారం ఇస్తున్నారని పేర్కొంటూ కొద్దిసేపు నిరసన తెలిపారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని