తాజా వార్తలు

Published : 15/06/2021 06:13 IST
అల కల్లోలం

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో సోమవారం సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరానికి సుదూరం నుంచి కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. అక్కుపల్లి శివసాగర తీరంలో సముద్రం చాలా మేరకు ముందుకు చొచ్చుకురావడంతో సమీప తోటలకు అలలు తాకాయి. దిబ్బలు సముద్రగర్భంలో కలిసిపోయాయి. వేట నిషేధకాలం ముగిసి మత్స్యకారులు అంతా మళ్లీ చేపల వేట సాగించేందుకు సన్నద్ధమవుతున్న సమయంలో ఈ అలజడితో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

- న్యూస్‌టుడే, వజ్రపుకొత్తూరు

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని