తాజా వార్తలు

Published : 15/06/2021 06:13 IST
సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం తగదు

మోకాళ్లపై నిలబడి నిరసన తెలుపుతున్న పారిశుద్ధ్య కార్మికులు

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.గోవిందరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌(సీఐటీయూ అనుబంధం) ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్మికులు విధులు బహిష్కరించారు. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మోకాళ్లపై కూర్చొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ పురపాలక సంఘాల్లోని ఒప్పంద, పొరుగుసేవల కార్మికులను క్రమబద్ధీకరించాలన్నారు. సచివాలయాలకు బదలాయింపు ఆలోచన విరమించుకోవాలన్నారు. యూనియన్‌ జిల్లా నాయకుడు ఎన్‌.బలరాం మాట్లాడుతూ డిమాండ్లు పరిష్కరించే వరకు దశల వారీగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, నాయకులు ఎ.సత్యనారాయణ, టి.తిరుపతిరావు, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు ఎ.గణేష్‌, కె.రాజు, కె.వేణుగోపాలరావు, ఎన్‌.పార్థసారథి పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని