తాజా వార్తలు

Published : 15/06/2021 06:13 IST
‘నిరాశ్రయులను ఆదుకుంటాం’

బాధితులకు చెక్కు అందజేస్తున్న శ్రీకాంత్‌

వీరఘట్టం, న్యూస్‌టుడే: నిరుపేద కుటుంబాలకు చెందిన నిరాశ్రయులను ఆదుకుంటామని తూర్పుకాపు కార్పొరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి శ్రీకాంత్‌ అన్నారు. మండలంలోని కత్తులకవిటిలో తల్లిదండ్రుల మరణంతో నిరాశ్రయులైన జ్యోతి, కిరణ్మయిలకు తూర్పుకాపు సంఘం ఆధ్వర్యంలో రూ.2.80 లక్షల చెక్కును ఆయన సోమవారం అందజేశారు. ఈ మొత్తాన్ని ఈ చిన్నారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. కరోనాతో మరో బాధిత కుటుంబానికి రూ.20 వేల సాయాన్ని అందజేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.చంద్రమోహనరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పతివాడ గిరీశ్వరరావు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అధ్యక్షులు ఎస్‌.మోహనరావు, ఎ.అప్పలసూరి తదితరులు పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని