తాజా వార్తలు

Published : 15/06/2021 06:13 IST
26న వర్చువల్‌ లోక్‌అదాలత్‌

శ్రీకాకుళం లీగల్‌, న్యూస్‌టుడే: ఈనెల 26వ తేదీన వర్చువల్‌ లోక్‌అదాలత్‌ను నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కోర్టు సముదాయం వద్ద నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా కారణంగా గత కొంతకాలంగా కేసులు పెండింగులో ఉండిపోయాయన్నారు. వీటిలో రాజీపడదగిన కేసుల పరిష్కారానికి వర్చువల్‌ లోక్‌అదాలత్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని