తాజా వార్తలు

Published : 15/06/2021 06:13 IST
కవ్వింపు చర్యలకు పాల్పడొద్దు

సిబ్బందికి సూచనలిస్తున్న డీఎఫ్‌వో సందీప్‌ కృపాకర్‌

భామిని, సీతంపేట, న్యూస్‌టుడే: కవ్వింపు చర్యలకు పాల్పడితే ఏనుగులతో పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుందని జిల్లా అటవీ అధికారి సందీప్‌ కృపాకర్‌ హెచ్చరించారు. సోమవారం ఆయన మండలంలోని కోసలి, ఘనసర తాలాడ గ్రామాల్లో ఏనుగుల సంచరించే ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఎవరూ వాటి వద్దకు వెళ్లడం కానీ, చరవాణిలో ఫొటోలు తీసేందుకు ప్రయత్నం కానీ చేయకూడని సూచించారు. జన సముహం ఎక్కువగా ఉండే సమయాల్లో లోకల్‌ పోలీసుల సహకారం తీసుకోమని సిబ్బందికి సూచించారు. అనుక్షణం గస్తీ తిరుగుతూ వాటిని పరిశీలించాలని ట్రాకర్లుని ఆదేశించారు. పాతపట్నం రేంజ్‌ అధికారి రౌతు రాజశేఖర్‌, అటవీ శాఖ బీట్‌ అధికారులు శివకృష్ణ, దాలినాయుడు ఉన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని